పాము దాహార్తిని ఇలా తీర్చాడు…!

| Edited By:

Jun 26, 2019 | 3:33 PM

ఒడిశాలోని చిలకా డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ఇటీవల ఓ పాముకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించడం చర్చనీయమైంది. అతను ఎలాంటి రక్షణ లేకుండా చిన్న పిల్లలకు పాలు తాగించినంత సులభంగా నీళ్లు తాగించడం చూసి అంతా ఆశ్చర్య‌పోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో సుశాంత్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. మధు పూర్ణిమా అనే సామాజికవేత్త పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మంది […]

పాము దాహార్తిని ఇలా తీర్చాడు...!
Follow us on

ఒడిశాలోని చిలకా డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ఇటీవల ఓ పాముకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించడం చర్చనీయమైంది. అతను ఎలాంటి రక్షణ లేకుండా చిన్న పిల్లలకు పాలు తాగించినంత సులభంగా నీళ్లు తాగించడం చూసి అంతా ఆశ్చర్య‌పోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో సుశాంత్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. మధు పూర్ణిమా అనే సామాజికవేత్త పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మంది వీక్షించారు. పాము దాహంగా ఉందని ఎలా తెలుస్తుందని ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సుశాంత్ స్పందిస్తూ.. ‘‘చెప్పడం కష్టమే. అయితే, డీహైడ్రేషన్‌కు గురైన పాము దాని చర్మాన్ని కోల్పోతుంది. దాని చర్మాన్ని పట్టుకుంటే ఈ విషయం తెలుస్తుంది. అయితే, జాగ్రత్త.. అలా పట్టుకున్న తర్వాత అదే మీకు చివరి రోజు కావచ్చు’’ అని చమత్కరించారు.