Viral News: కొడుక్కి ‘ABCDEFGHIJK’ అని పేరు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

|

Oct 30, 2021 | 11:15 AM

సాధారణంగా పిల్లలకు దేవుడి పేర్లు, లేదా వారి జన్మనక్షత్రం ఆధారం పేర్లు పెడుతుంటారు. లేదా ఇంకొందరు తమ పూర్వీకులపై ప్రేమ..

Viral News: కొడుక్కి ABCDEFGHIJK అని పేరు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
1
Follow us on

సాధారణంగా పిల్లలకు దేవుడి పేర్లు, లేదా వారి జన్మనక్షత్రం ఆధారం పేర్లు పెడుతుంటారు. లేదా ఇంకొందరు తమ పూర్వీకులపై ప్రేమ, గౌరవంతో పేర్లను వారి పేర్లను పెడుతుంటారు. అదీ లేదనుకుంటే తమ అభిమాన తారలు, వ్యక్తుల పేర్లతో పిలుచుకుంటారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు ఇంగ్లీష్‌ alphabetsలోని అక్షరాలను పేరుగా పెట్టాడు. ABCDEFGHIJK అనే పేరు పెట్టాడు.

దక్షిణ సుమత్రాలోని మురా ఎనిన్‌లో టీకా వేసుకోవడానికి ఆ బాలుడు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరేమిటని అధికారులు అడగ్గా, ఆ పిల్లాడు ఇంగ్లీష్ అల్భాబేట్ గడగడ చదవడం ప్రారంభించాడు. దీంతో అధికారులు ఇదంతా జోక్ అని తేలికగా తీసుకుని మరోసారి పేరేమిటని అడిగారు. ఆ బాలుడు మళ్లీ అదే తీరు పాటించాడు. ఇలా కాదని, ఆ అధికారులు బాలుడి తండ్రిని ఆరాతీశారు. అప్పుడు ఆ బాలుడి పేరే ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకే జుజు అని నిర్ధారణకు వచ్చారు. ఆ బాలుడు తన మిత్రుల దగ్గర ఇవన్నీ అక్షరాలు చదవడానికి బదులుగా ఓ షార్ట్ ఫామ్‌ను ఎంచుకున్నాడు. సింపుల్‌గా అడెఫ్‌గా పిలిపించుకుంటున్నాడు.

ఈ వింత పేరుకూ ఆ తండ్రి దగ్గర ఓ వివరణ ఉన్నది. తనకు పజిల్స్ చేయడమంటే ఇష్టమని, అందుకే ఇంగ్లీష్ వర్ణమాలలోని అక్షరాలపై ప్రేమ కారణంగానే తన కొడుక్కి ఈ పేరు పెట్టినట్టు వివరించాడు. కాగా, చివర అంటించిన జుజుకూ ఓ ప్రత్యేకత ఉందట. ఆ దంపతుల పేర్లు జుహ్రో, జుల్ఫాహ్మి. ఈ ఇద్దరి పేర్లలోని ‘జు’లను తీసుకుని చివరన జుజు అని తగిలించాడు. ఇలాంటి వింత పేర్లు విదేశాలకే పరిమితం కాదు.. మనదేశంలోనూ ఇలాంటివాటికి కొదవ లేదు. కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో ఇద్దరు దంపతుల తమ పాపకు కరోనా అని పేరుపెట్టారు. అంతెందుకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్తూరుకు చెందిన ఓ రైతు చరిత్రపై తనకున్న ఆసక్తితో పిల్లలకు చైనా రెడ్డి, రష్యా రెడ్డి, జపాన్ రెడ్డి వంటి వింత పేర్లు పెట్టి వార్తల్లోకెక్కారు.