Viral Video: పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే.. కొడుకు చేసిన పనికి.!

Trending Video: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలు ఎంతో కీలకమని భావిస్తుంటారు. కాబట్టి, ఎంత కష్టమైనా, వారు తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయినప్పుడు సహజంగానే కోపంగా ఉంటారు. కానీ ఒక తండ్రి తన కొడుకును పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తెలిసి..

Viral Video: పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే.. కొడుకు చేసిన పనికి.!
Chaina Viral Video

Updated on: Jul 11, 2025 | 1:02 PM

Trending Video: చైనాలోని బీజింగ్‌లో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడనే కోపంతో ఒక తండ్రి తన కొడుకును తీవ్రంగా కొట్టాడు. ఈ దురదృష్టకర సంఘటన విద్యా రంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిని, దాని పట్ల తల్లిదండ్రులు కొన్నిసార్లు ప్రదర్శించే తీవ్ర ప్రతిచర్యలను స్పష్టం చేస్తుంది. ఈ వీడియోలో కొడుకును వెంబడించి మరీ కొట్టడం చూడొచ్చు. కొడుకు రోడ్డుపైకి వచ్చి పరిగెత్తడం కూడా వీడియోలో కనిపిస్తోంది. మొదట్లో దెబ్బలు తిన్న కొడుకు చివరికి తండ్రిపై తిరగబడి కొట్టడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@AsianDawn4 అనే ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోలో తన కొడుకు ఫెయిలయ్యాడని కోపంగా ఉన్న ఒక తండ్రి తన బెల్ట్ పట్టుకుని కొడుకును రోడ్డుపైకి లాక్కెళ్లి మరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. మొదట్లో ప్రశాంతంగా ఉన్న కొడుకు చివరికి తన తండ్రిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. తండ్రి కొడుకులు గొడవ పడుతున్న సీన్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో ఇప్పటికే పద్దెనిమిది వేలకుపైగా వ్యూస్‌ పొందింది. ఇది ఒక భీకర యుద్ధంలోని సీన్ కావొచ్చు అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు తల్లిదండ్రులు ఇలా చేయడం తప్పని కామెంట్ చేశారు. మొత్తానికి నెటిజన్లను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..