Viral Video: డ్రైవర్ లేకుండానే రోడ్డుపై రివర్స్‌లో దూసుకెళ్లిన వ్యాన్..

|

Aug 07, 2024 | 3:34 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. మరికొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని చూస్తే మాత్రం నిజంగానే చాలా భయం వేస్తుంది. ఇలా కూడా చేస్తారా? అని అనిపిస్తుంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఒకరు చేసిన తప్పుకు చాలా మంది..

Viral Video: డ్రైవర్ లేకుండానే రోడ్డుపై రివర్స్‌లో దూసుకెళ్లిన వ్యాన్..
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. మరికొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని చూస్తే మాత్రం నిజంగానే చాలా భయం వేస్తుంది. ఇలా కూడా చేస్తారా? అని అనిపిస్తుంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఒకరు చేసిన తప్పుకు చాలా మంది బలి అవుతున్నారు. ఇది కూడా దానికి సంబంధించిన వీడియోనే. ఓ ప్రభుత్వ వాహనం జాతీయ రహదారి మీద రివర్స్‌లో వెనక్కి ఎంతో స్పీడుగా వెళ్లింది. ఆ సమయంలో పెద్దగా ట్రాఫిక్ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది.

పూణెకు చెందిన ఓ మున్సిపల్ కార్పొరేషన్.. రోడ్ మెయిన్‌‌టెనెన్స్‌కి సంబంధించిన ఓ వ్యాన్.. రోడ్డుపై ఆపి ఉంచారు. ఆ వ్యాన్ లోపల డ్రైవర్ కూడా లేడు. మరి ఎలా జరిగిందో తెలీదు కానీ.. ఆగి వున్న వ్యాన్ ఉన్నట్టుండి.. రివర్స్‌లో స్పీడుగా వెళ్లి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టి నిలిచి పోయింది. ఈ ఘటన అర్థరాత్రి సుమారు 11.45 నిమిషాల సమయంలో జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. రోడ్డుకు ఇటువైపు ఉన్నవారు ఈ సంఘటనను వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కి గురవుతున్నారు. అయితే ఈ వీడియోపై పౌర సంఘం నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా పూణేలో మద్యం మత్తులో ఉన్న 17 ఏళ్ల కుర్రాడు తన పోర్స్చే కారును ఢీ కొట్టడంతో 24 ఏళ్ల ఇద్దరు టెక్కీలు తక్షణమే మరణించిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.