Shocking Video: హార్స్ పవర్ తెలుసు.. మరి డాంకీ పవర్ చూశారా?.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారంతే..

|

Sep 19, 2021 | 5:39 PM

Donkey Race: బైక్ రేస్ చూసుంటారు.. కార్ రేస్ చూసుంటారు.. గుర్రం రేస్ చూసుంటారు.. మరి గాడిదల రేస్ చూశారా? గాడిదలు ఎంత వేగంగా పరుగెడతాయో..

Shocking Video: హార్స్ పవర్ తెలుసు.. మరి డాంకీ పవర్ చూశారా?.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారంతే..
Donkey Race
Follow us on

Donkey Race: బైక్ రేస్ చూసుంటారు.. కార్ రేస్ చూసుంటారు.. గుర్రం రేస్ చూసుంటారు.. మరి గాడిదల రేస్ చూశారా? గాడిదలు ఎంత వేగంగా పరుగెడతాయో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. గాడిద రేస్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అంత స్పీడ్‌గా పరుగెడుతున్నాయి మరి. సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో దాదాపుగా చాలా వీడియోలో ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని షాకింగ్‌గా.. ఆశ్చర్యానికి గురిచేసిగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గాడిద రేస్‌కు సంబంధించిన వీడియో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా గాడిదలు అంత స్పీడ్‌గా పరుగెత్తవు. కానీ, ఈ గాడిదలు మాత్రం బైక్‌ల కంటే కూడా స్పీడ్‌గా పరుగులు తీస్తున్నాయి. అది కూడా వాహనాలతో రద్దీగా ఉండే నడిరోడ్డుపై సందడి చేశాయి.

ఈ వైరల్ వీడియోలో రెండు గాడిద బగ్గీలపై కొందరు యువకులు కూర్చున్నారు. ఒక్కో బగ్గీపై ఇద్దరేసి యువకులు కూర్చున్నారు. గాదిలతో పోటీ పెట్టారు. నడి రోడ్డుపై అవి ఒక రేంజ్‌లో పరుగులు తీస్తున్నాయి. ఒకదానిని మించి మరోటి పోటీ పడి మరీ పరుగులు తీశాయి. రోడ్డుపై వెళ్తున్న భారీ వాహనాలతో పోటీగా రేస్‌లో పాల్గొన్నాయి. అయితే, గాడిదల రేస్‌ను కొందరు వాహనదారులు వీడియో తీయగా.. ఆ వీడియోను comedy_videos7952 అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇవి గాడిదలా? గుర్రాలా? అని షాక్ అవుతున్నారు వాటి రేస్ చూసి. బైక్ రైడర్ మాదిరి గాడిదల రైడింగ్ చేయడం అద్భుతం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘హార్స్ పవర్ గురించి మర్చిపోండి.. ఇప్పుడు డాంకీ పవర్ గురించి తెలుసుకోండి’ అంటూ ఓ నెటిజన్ సరదా కామెంట్ చేశారు. నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..