ఈ ఇంటెలిజెంట్ “డాంకీ”ని చూస్తే వావ్ అనాల్సిందే..

| Edited By:

Dec 18, 2019 | 7:10 AM

సమస్యలు మనుషులకే కాదు.. జంతువులకీ వస్తాయి. అయితే వాటిని ఎదుర్కోనే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. కొందరికి సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఉంటారు. వారి తెలివితో ఆ సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇక మరికొందరు మాత్రం చిన్న సమస్యనుంచి గట్టెక్కేందుకు కూడా బాగా కష్టపడిపోతుంటారు. అందుకు కారణం ఆలోచనా విధానం మాత్రమే. సమస్య నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. సమస్య ఒకటే అయినా.. మనిషిలో ఆలోచించే విధానంలో ఉన్న తేడాతో ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది. సేమ్ అలాగే […]

ఈ ఇంటెలిజెంట్ డాంకీని చూస్తే వావ్ అనాల్సిందే..
Follow us on

సమస్యలు మనుషులకే కాదు.. జంతువులకీ వస్తాయి. అయితే వాటిని ఎదుర్కోనే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. కొందరికి సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఉంటారు. వారి తెలివితో ఆ సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇక మరికొందరు మాత్రం చిన్న సమస్యనుంచి గట్టెక్కేందుకు కూడా బాగా కష్టపడిపోతుంటారు. అందుకు కారణం ఆలోచనా విధానం మాత్రమే. సమస్య నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. సమస్య ఒకటే అయినా.. మనిషిలో ఆలోచించే విధానంలో ఉన్న తేడాతో ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది. సేమ్ అలాగే పలు సందర్భాల్లో జంతువులకు కూడా చిన్నచిన్న ఇబ్బందులు.. సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటిలో కూడా ఆలోచనా విధానం మనిషి వలే ఉంటుంది. సమస్యను గ్రహించి దానిని ఎలా దాటి ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఒక్కో జంతువుది ఒక్కో ఆలోచన. ఇక వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో కొన్ని గాడిదలు కర్రను దాటుతున్న వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. అయితే కర్రను దాటితే వింతేముంది అంటే పొరపాటే. ఎందుకంటే గాడిద.. గుర్రం వలే ఎక్కువ ఎత్తు ఎగరలేదు. అయితే ఆ కర్ర కొంచెం ఎత్తులో ఉంది. కొన్ని గాడిదలు మాత్రం కష్టపడి ఆ కర్రను దాటాయి. అయితే ఓ గాడిదకు మాత్రం ఆ కర్రను దాటడం ఇబ్బందిగా మారింది. దీంతో ఒక్క అడుగు వెనక్కి వేసి.. దాని బుర్రకు పనిచెప్పింది. అక్కడ అసలు కర్ర ఎలా వచ్చింది. అది ఎలా ఉంది అని ఓ లుక్‌వేసింది. అంతే.. తన నోటితో అడ్డుగా ఉన్న కర్రను తొలగించి నడుచుకుంటూ వెళ్లింది. ఇలా తన స్మార్ట్ తెలివిని ఉపయోగించి.. సమస్యను ఎదుర్కొన్న ఈ గాడిదకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.