శునకం ఇస్తోన్న మెసేజ్.. పాటిద్దాం గురూ..!

| Edited By:

Jan 08, 2020 | 9:33 AM

‘‘రోడ్డు భద్రతా నియమాలను పాటించండి.. హెల్మెట్ ధరించండి. సీటు బెల్ట్ ధరించండి’’ అంటూ ఎంత అవగాహన కల్పించినా.. దానిని పెడచెవిన పెట్టే వాళ్లు లేకపోలేరు. ఫైన్ల పుణ్యమా అని కొంతమంది హెల్మెట్‌లను పెట్టుకుంటున్నప్పటికీ.. చాలామంది మాత్రం దాన్ని లైట్ తీసుకుంటూనే ఉంటారు. అయితే వారందరికీ ఓ శునకం ఇప్పుడు మెసేజ్ ఇస్తోంది. తమిళనాడులో ఓ వ్యక్తి తన శునకాన్ని బైక్‌పై కూర్చొబెట్టుకొని వెళుతున్నారు. అయితే భద్రత కోసం తాను హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు ఆ శునకానికి కూడా […]

శునకం ఇస్తోన్న మెసేజ్.. పాటిద్దాం గురూ..!
Follow us on

‘‘రోడ్డు భద్రతా నియమాలను పాటించండి.. హెల్మెట్ ధరించండి. సీటు బెల్ట్ ధరించండి’’ అంటూ ఎంత అవగాహన కల్పించినా.. దానిని పెడచెవిన పెట్టే వాళ్లు లేకపోలేరు. ఫైన్ల పుణ్యమా అని కొంతమంది హెల్మెట్‌లను పెట్టుకుంటున్నప్పటికీ.. చాలామంది మాత్రం దాన్ని లైట్ తీసుకుంటూనే ఉంటారు. అయితే వారందరికీ ఓ శునకం ఇప్పుడు మెసేజ్ ఇస్తోంది. తమిళనాడులో ఓ వ్యక్తి తన శునకాన్ని బైక్‌పై కూర్చొబెట్టుకొని వెళుతున్నారు. అయితే భద్రత కోసం తాను హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు ఆ శునకానికి కూడా ఇంకొకటి పెట్టాడు. ఇక బైక్‌ మీద యజమాని వెనుకాల ఎంతో జాగ్రత్తగా కూర్చొంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆ కుక్కను చూసి నేర్చుకోవాలి అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరేమో కుక్కను అలా ఎక్కించుకోవడం ఏంటి..? అది బ్యాలెన్స్‌ తప్పి కిందపడితే దాని ప్రాణానికే ప్రమాదం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/madhavpramod1/status/1214415853065666560?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1214415853065666560&ref_url=https%3A%2F%2Findianexpress.com%2Farticle%2Ftrending%2Fviral-videos-trending%2Fwatch-dog-wears-helmet-while-riding-bike-in-tamil-nadu-6204868%2F