Viral Video: అద్దంలో చూసుకుంటూ ఈ కుక్క చేసిన పనికి కడుపుబ్బా నవ్వాల్సిందే.!

|

Aug 17, 2021 | 1:16 PM

చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమేటిక్‌గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి..

Viral Video: అద్దంలో చూసుకుంటూ ఈ కుక్క చేసిన పనికి కడుపుబ్బా నవ్వాల్సిందే.!
Dog
Follow us on

చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమేటిక్‌గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ మరింత ఫన్నీగా ఉంటాయి. జంతువులను మొదటిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్‌లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. వేరే ఏదో జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

ఈ వీడియోలో ఓ శునకం తొలిసారి అద్దాన్ని చూస్తుంది. ఇక దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఉలిక్కిపడుతుంది. కాస్త పక్కకు జరిగి మళ్లీ అద్దంలో చూసుకుంటుంది. ఇదేంటి ఇక్కడ మరేవరో ఉన్నారు అనే భయం.. సందేహంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటుంది. మరోసారి అద్దంలో చెక్‌ చేసుకుంటుంది. ఇలా రెండు మూడు సార్లు అద్దంలో తన ముఖం చూసుకున్న కుక్క కోపంతో రగిలిపోయింది. పక్కనే ఉన్న వ్యక్తికి విషయం చెప్పినట్టుగా.. మరో కుక్కను తనతో వెంటబెట్టుకుని అద్దం ముందుకు వచ్చింది అద్దంలో ఉన్న మరో కుక్క మీదకు కోపంతో అరవసాగింది. చివరకు చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు కుక్క ఏమని ఆలోచించిందో అని ఊహించుకుంటూ రకరకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.