ఎదురీత ముందు..విధి రాత ఎంత?

|

Apr 03, 2019 | 5:58 PM

ఏదైనా సాధించాలన్నా తపన ఉంటే చాలు..విధి రాతను కూడా జయించొచ్చు. అచ్చు అలాంటి కసిని, కృషిని చూపించాడు ఒక బాలుడు. రెండు చేతులు లేకున్నా కూడా మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. క్రికెట్‌పై తనకున్న ప్రేమను చాటి చెబుతున్నాడు.  ఇష్టమైన ఆట కోసం వైకల్యాన్ని కూడా లైట్ తీసుకున్నాడు. ఓ గల్లీలో కొందరు టీనేజ్‌ పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న వీడియో టీమిండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా దృష్టికి వచ్చింది.  ఇంకేముంది  ‘క్రికెట్‌ ఆడటం నుంచి ఇతడిని ఎవరూ […]

ఎదురీత ముందు..విధి రాత ఎంత?
Follow us on

ఏదైనా సాధించాలన్నా తపన ఉంటే చాలు..విధి రాతను కూడా జయించొచ్చు. అచ్చు అలాంటి కసిని, కృషిని చూపించాడు ఒక బాలుడు. రెండు చేతులు లేకున్నా కూడా మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. క్రికెట్‌పై తనకున్న ప్రేమను చాటి చెబుతున్నాడు.  ఇష్టమైన ఆట కోసం వైకల్యాన్ని కూడా లైట్ తీసుకున్నాడు. ఓ గల్లీలో కొందరు టీనేజ్‌ పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న వీడియో టీమిండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా దృష్టికి వచ్చింది.  ఇంకేముంది  ‘క్రికెట్‌ ఆడటం నుంచి ఇతడిని ఎవరూ ఆపలేరు’ అంటూ వెంటనే దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కుర్రాడి ప్రతభకు ఫిదా అవుతున్నారు. చిన్న, చిన్న సమస్యలకే ఆత్మహత్యకు దారులు వెతుకుంటున్న వారికి ఈ వీడియో పెద్ద పాఠం. అందుకే ఈ కాబోయే క్రికెటర్‌కి టీవీ9 తరుపున బెస్ట్ విషస్..కీప్ రాకింగ్ చిన్నోడా.