Video: మెట్రోలో ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో! మెట్రోలో ఉన్నోళ్లంతా షాక్‌..

ఢిల్లీ మెట్రోలో రద్దీ సమయంలో సీటు దొరకక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఒక యువతి అద్భుతమైన పరిష్కారం చూపించింది. తన సంచిలోంచి ఒక టబ్ తీసి దానిపై కూర్చున్న ఆమె వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను @Rawat_1199 షేర్ చేయడంతో 8 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు వివిధ రకాలైన కామెంట్లతో వీడియోకు స్పందిస్తున్నారు.

Video: మెట్రోలో ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో! మెట్రోలో ఉన్నోళ్లంతా షాక్‌..
Delhi Metro

Updated on: Apr 18, 2025 | 5:48 PM

మెట్రో ప్రయాణికులు చేసే కొంత మంది వికృత చేష్టల వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. సీట్ల కోసం తగాదాలు, రీల్స్ పిచ్చి, ప్రేమికుల పిచ్చి పనులు వంటివి ఎక్కువగా వైరల్‌ అవుతూ ఉంటాయి. సాధారణంగా, మెట్రోలో ప్రయాణించేటప్పుడు, మీకు సీటు లేకపోతే, ఎవరైనా దిగుతున్నారేమో అని వేచి చూస్తూ నిలబడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు, ఒక యువతి వేసిన ప్లాన్ ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రోలో కూర్చోవడానికి ఒక యువతి తన ఏర్పాట్లు తానే చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో @Rawat_1199 అనే ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో బ్లాక్‌ డ్రెస్‌ ధరించిన ఒక యువతి చేతిలో ఓ సంచితో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు చూడవచ్చు. కొద్ది సేపటి తర్వాత తన సంచిలో ఉన్న టబ్ ను బయటికి తీసింది. దానిపైకి మధ్యలో పెట్టి.. అందులో కూర్చుంది. ఆమె చుట్టూ ఉన్నవారు టబ్ మీద కూర్చున్న యువతిని చూసి నవ్వడం ప్రారంభించారు. ఈ వీడియోకు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.