Goat Milk: మేక పాలతో డెంగ్యూకు చెక్‌.? దెబ్బకు పెరిగిన డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే షాకే.!

Goat Milk Side Effects: మామూలుగా లీటర్ మేక పాలు 30 రూపాయలకే దొరికేస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో లీటర్‌ మేక పాలు రూ. 400లు పెట్టినా..

Goat Milk: మేక పాలతో డెంగ్యూకు చెక్‌.? దెబ్బకు పెరిగిన డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే షాకే.!
Goat Milk

Updated on: Oct 23, 2021 | 7:51 PM

మామూలుగా లీటర్ మేక పాలు 30 రూపాయలకే దొరికేస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో లీటర్‌ మేక పాలు రూ. 400లు పెట్టినా కూడా దొరకట్లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకని.. ఇంతలా మేక పాలకు డిమాండ్‌ పెరిగిందంటే.. ఇందుకు కారణం డెంగ్యూ కేసులు పెరగడమే అని తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. ఇంతకీ డెంగ్యూ కేసులు పెరగడానికి, మేక పాలకు సంబంధం ఏంటో మీరే చూడండి.

డెంగ్యూ వచ్చిన పేషెంట్లలో ప్లేట్ లెట్లు అమాంతం పడిపోతుంటాయి. ఆ రక్తకణాలు పడిపోకుండా, మెరుగైన సంఖ్యలో ఉంచేందుకు మేక పాలు దోహదపడతాయని ఛత్తర్‌పూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు చెప్పడంతో.. జనాలు మేకపాల కోసం ఎగబడుతున్నారు. అనుకోకుండా పెరిగిన ఈ డిమాండ్‌తో వ్యాపారులు ధరలు బాగా పెంచేశారు.

అయితే డెంగ్యూ వచ్చిన రోగులు మేక పాలు తాగితే మంచిదేగానీ.. అదే డెంగ్యూను పూర్తిగా తగ్గిస్తుందనుకోవడం మాత్రం పొరపాటని తెలిపాడు డాక్టర్ అభయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఛత్తర్ పూర్‌లో డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే 20 దాకా కేసులున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జనం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనాలు మేకపాలపై దృష్టి పెడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us