నాతో ఆడతారా… అంటూ ఫుట్ బాల్ పట్టుకున్న ఆవు

| Edited By:

Jul 02, 2019 | 10:07 PM

ఫుట్ బాల్.. ప్రపంచంలో క్రికెట్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న ఆట ఇది. అయితే.. ఆ ఆట మనదేశంలో ఎంతో కాలంగా ఆడుతున్నా.. అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు తక్కువే. అంతేకాదు.. దేశంలో ఫుట్ బాల్ ఆడే యూత్ కూడా తక్కువే. అయితే విషయానికి వస్తే.. కొందరు యువకులు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. వర్షం కూడా పడి ఉండటంతో.. గ్రౌండ్ అంతా తడిగా మారింది. అయితే.. ఇదే సమయంలో ఆ యువకులతో మ్యాచ్ ఆడేందుకు ఓ […]

నాతో ఆడతారా... అంటూ ఫుట్ బాల్ పట్టుకున్న ఆవు
Follow us on

ఫుట్ బాల్.. ప్రపంచంలో క్రికెట్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న ఆట ఇది. అయితే.. ఆ ఆట మనదేశంలో ఎంతో కాలంగా ఆడుతున్నా.. అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు తక్కువే. అంతేకాదు.. దేశంలో ఫుట్ బాల్ ఆడే యూత్ కూడా తక్కువే. అయితే విషయానికి వస్తే.. కొందరు యువకులు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. వర్షం కూడా పడి ఉండటంతో.. గ్రౌండ్ అంతా తడిగా మారింది. అయితే.. ఇదే సమయంలో ఆ యువకులతో మ్యాచ్ ఆడేందుకు ఓ అతిథి వచ్చింది. అయితే ఏదో అలా వచ్చింది అనుకుంటే పొరపాటే.. తాను కూడా మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యింది. అవును మీరు చదివింది నిజమే. ఆ అతిథిగా వచ్చింది ఓ ఆవు. ఆవేంటి మ్యాచ్ ఆడటమేంటి అనుకుంటున్నారా.. కింద ఉన్న వీడియోలో చూడండి. ఆ ఆవు వారితో పోటీ పడేందుకు గ్రౌండ్‌లో ఎంటర్ అయ్యింది. అదే సమయంలో బాల్ కాస్త ఆవు దగ్గర ఆగింది. అంతే.. ఇంకేముంది.. ఇప్పుడు బంతిని ఎవరు తీసుకుంటారో రండి అన్నట్లు అందరినీ చూసింది. ఎట్టకేలకు ఓ ఆటగాడు బంతిని అందుకుని.. గోల్ వైపు పోస్ట్ చేశాడు. అటుగా వెళ్లి మళ్లీ బంతిని అడ్డుకుంది. అంతేకాదు ఫుట్ బాల్ ప్లేయర్ లాగానే స్టిల్ ఇస్తూ ఆటలో ఆకట్టుకుంది. ఆవు ఫుట్ బాల్ ఆడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.