Viral News: నిశ్చితార్థానికి వచ్చిన గెస్ట్‌ల కోసం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ రియాక్షన్ ఏమంటే?

|

Aug 07, 2024 | 1:54 PM

ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్లు ఉన్నా.. బయట నుంచి తెప్పించకుండా కాస్త ఇంట్లోనే వండిస్తారు. అందులోనూ పెళ్లి, ఎంగేజ్ మెంట్, బర్త్‌ డే ఫంక్షన్లకు అయితే దగ్గర ఉండి మరీ వంటలను రుచిగా చేయిస్తారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పటి రోజులు పోయాయి. ఫంక్షన్ ఏదైనా సరే.. 100 మంది లోపు ఉంటే క్యాటరింగే బెటర్ అని ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లే వచ్చి దగ్గరుండి మరీ ఫుడ్ సర్వ్ చేస్తారు. అందరికీ తగ్గట్టుగా ఫుడ్ తీసుకొస్తారు. దీంతో ఫుడ్ బాగున్నా..

Viral News: నిశ్చితార్థానికి వచ్చిన గెస్ట్‌ల కోసం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ రియాక్షన్ ఏమంటే?
Viral News
Follow us on

ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్లు ఉన్నా.. బయట నుంచి తెప్పించకుండా కాస్త ఇంట్లోనే వండిస్తారు. అందులోనూ పెళ్లి, ఎంగేజ్ మెంట్, బర్త్‌ డే ఫంక్షన్లకు అయితే దగ్గర ఉండి మరీ వంటలను రుచిగా చేయిస్తారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పటి రోజులు పోయాయి. ఫంక్షన్ ఏదైనా సరే.. 100 మంది లోపు ఉంటే క్యాటరింగే బెటర్ అని ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లే వచ్చి దగ్గరుండి మరీ ఫుడ్ సర్వ్ చేస్తారు. అందరికీ తగ్గట్టుగా ఫుడ్ తీసుకొస్తారు. దీంతో ఫుడ్ బాగున్నా బాలేకపోయినా క్యాటరింగ్ వాళ్లదే బాధ్యత. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరింత ముందుకు వేశారు ఈ జంట.

ఇప్పుడు ఆన్ లైన్‌ ఫుడ్ డెలివరీలు ఎక్కువయ్యాయి. జస్ట్ ఆర్డర్ పెడితే చాలు.. ఎంత దూరమైనా.. క్షణాల్లో మన ముందు వాలిపోయి.. రుచికరమైన వేడి వేడిగా ఉండే ఫుడ్‌ని అందిస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్‌ డెలివరీలు.. అస్సలు టైమ్ కుదరనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్డర్లు పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం తమ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చిన అతిథులకు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. ఈ విషయాన్ని సుస్మితా అనే వ్యక్తి X ఖాతాలో షేర్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. స్విగ్గీ సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ బాక్సులను ఓ టేబుల్‌పై సర్దుతున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజర్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి క్రేజీ డీల్ ఇప్పటి వరకూ చూడలేదు. స్విగ్గీని ఇలా కూడా వాడతారా అని రిప్లై ఇస్తున్నారు. కాగా సుస్మితా పోస్ట్‌పై స్విగ్గీ కూడా రియాక్ట్ అయ్యింది. భోజనాల ఆర్డర్ కూడా మాకే ఇవ్వాలి అని పోస్ట్ చేశారు.