ఇంతకంటే గొప్ప భర్త దొరుకుతాడా..? శ్రీమతి కోసం ఛైర్ అయ్యాడు..

|

Dec 08, 2019 | 3:53 PM

ఇప్పుడు మీకు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న ఓ భర్తని, అలాగే కొంచెం కూడా ఇంగితం లేని కొందరు వ్యక్తులను పరిచయం చేయబోతున్నాం. నిండు గర్భంతో ఉన్న తన భార్య కోసం కుర్చీగా మారిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి  ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్యను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పేషెంట్స్ ఎక్కువమంది ఉండటంతో, వారి వంతు రావడానికి కొంత టైం పట్టింది. […]

ఇంతకంటే గొప్ప భర్త దొరుకుతాడా..? శ్రీమతి కోసం ఛైర్ అయ్యాడు..
Follow us on

ఇప్పుడు మీకు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న ఓ భర్తని, అలాగే కొంచెం కూడా ఇంగితం లేని కొందరు వ్యక్తులను పరిచయం చేయబోతున్నాం. నిండు గర్భంతో ఉన్న తన భార్య కోసం కుర్చీగా మారిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి  ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్యను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పేషెంట్స్ ఎక్కువమంది ఉండటంతో, వారి వంతు రావడానికి కొంత టైం పట్టింది.

ఆ ప్రాంతంలో కుర్చీలు ఉన్నప్పటికీ పేషెంట్స్‌తో పాటు వారికోసం వచ్చిన బంధువులతో అవి నిండిపోయాయి. ప్రెగ్నెంట్ అన్న ఇంగితం కూడా లేని  వ్యక్తులు ఆమెకు కనీసం లేచి కుర్చీ ఇవ్వలేదు. దీంతో సదరు ప్రెగ్నెంట్ లేడీ ఎక్కవసేపు నిలబడలేక ఇబ్బందులు పడింది. అది గమనించిన భర్త తనే కుర్చీగా మారాడు. తాను కింద కూర్చోని, భార్యను భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ప్రస్తుతం భార్యాభర్తల బంధాలు ఎంత పలుచబారిపోయాయో చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాలకే గొడవలు, చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోలేక విడాకులు. ఇదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది.  బట్ భార్య కోసం కుర్చీగా మారిన ఈ వ్యక్తికి సెల్యూట్ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు.