Viral News: రెండేళ్లుగా ఎంతకూ తగ్గని దగ్గు.. స్కాన్‌ చేసి చూడగా కళ్లు బైర్లు కమ్మాయి..

|

Jul 26, 2024 | 8:48 AM

తూర్పు చైనీస్‌ పప్రావిన్స్‌ జెజియాంగ్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి జు గత రెండేళ్లుగా దగ్గుతో బాధపడ్డాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని రకాల మందులు, సిర్‌లు వేసుకున్నా దగ్గుమాత్రం ఎంతకీ తగ్గలేదు. దీంతో గత నెల జూన్‌లో జెజియాంగ్‌ హాస్పిటల్ వైద్యులు స్కాన్‌ చేయాలని సూచించారు. స్కాన్‌ చేసి చూడగా అతని ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్‌...

Viral News: రెండేళ్లుగా ఎంతకూ తగ్గని దగ్గు.. స్కాన్‌ చేసి చూడగా కళ్లు బైర్లు కమ్మాయి..
Representative Image
Follow us on

సాధారణంగా దగ్గు రెండు రోజులకు మించి ఉంటే వెంటనే ఏదొ ఒక ట్యాబ్లెట్‌ లేదా సిరప్‌ వేసుకుంటాం. అయితే నెలలు తరబడి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు నిర్వహించుకుంటాం. అదే ఏళ్ల తరబడి దగ్గు ఉంటే.. కచ్చితంగా ఏదో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలి. ఇలాగే ఓ వ్యక్తి ఏకంగా రెండేళ్లుగా తీవ్రమైన దగ్గుతో బాధపడ్డాడు. తీరా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు విషయం తెలిసి. అవాక్కయ్యారు ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

తూర్పు చైనీస్‌ పప్రావిన్స్‌ జెజియాంగ్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి జు గత రెండేళ్లుగా దగ్గుతో బాధపడ్డాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని రకాల మందులు, సిర్‌లు వేసుకున్నా దగ్గుమాత్రం ఎంతకీ తగ్గలేదు. దీంతో గత నెల జూన్‌లో జెజియాంగ్‌ హాస్పిటల్ వైద్యులు స్కాన్‌ చేయాలని సూచించారు. స్కాన్‌ చేసి చూడగా అతని ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్‌ ఉన్న కణతి ఒకటి కనిపించింది. దీంతో అది న్యుమోనియా లేదా క్యాన్సర్‌ కణితీగా భావించారు. ఇది కచ్చితంగా క్యాన్సరే అని ఫిక్స్‌ అయ్యారు. తర్వాత వైద్యులు ఆ కణితిని కొంత తీసి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష చేశారు.

అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. నిజానికి అది కణతి కాదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఊపిరితిత్తుల్లో ఉంది ఏంటనేగా సందేహం. ఊపిరితిత్తుల్లో ఒక మిర్చి ముక్క ఇరుక్కుపోయినట్లు గుర్తించిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. రెండేళ్లుగా అతని ఊపిరితిత్తుల్లో మిర్చి ముక్క అలాగే ఉండిపోయింది. రెండేళ్ల కరితం జు భోజనం చేసిన నాటి నుంచి ఈ అసౌకర్యం ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు.

ఊపిరితిత్తుల్లోని కణజాలం కింద మిరప ముక్క ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో వైద్యులు ఆ పెప్పర్‌ ముక్కను తొలగించడంతో సమస్య తీరింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..