Viral Video: ‘అయ్యయ్యో దొరికిపోయానే’.. పిల్లిని అడ్డంగా బుక్ చేసిన సీసీ కెమెరా.. నవ్వులే నవ్వులు..

Viral Video: ఇంట్లో దొంగలు పడుకుండా ఉండేందుకు చాలా మంది తమ తమ ఇళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.

Viral Video: ‘అయ్యయ్యో దొరికిపోయానే’.. పిల్లిని అడ్డంగా బుక్ చేసిన సీసీ కెమెరా.. నవ్వులే నవ్వులు..
Cctv Footage

Updated on: Jul 19, 2022 | 8:06 PM

Viral Video: ఇంట్లో దొంగలు పడుకుండా ఉండేందుకు చాలా మంది తమ తమ ఇళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. మార్కెట్‌లో రకరకాల కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణం నుంచి హై రేంజ్ వరకు కెమెరాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. 360 డిగ్రీలు కవర్ చేసే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు.. కొన్ని సార్లు దొంగలను పట్టిస్తే.. మరికొన్ని సార్లు రేర్ సంఘటనలను రికార్డ్ చేస్తాయి. అయితే, తాజాగా ఓ సీసీ కెమెరా రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుకు కారణం వీడియోలో కనిపించిన ఒక విజువల్. ఇంతకీ ఆ విజువల్‌లో ఏముంది? నెటిజన్లు ఎందుకు నవ్వుకుంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఆ కెమెరా ఇల్లంతటినీ కవర్ చేస్తోంది. ఇంతలో కెమెరాకు రెండు కాళ్లు అడ్డు పడ్డాయి. అసలే హై టెక్నాలజీ కలిగిన కెమెరా.. అనుమానంగా ఉండటంతో కాస్త పైకి చూపింది. ఇంకేముంది.. మెల్లగా పిల్లి ఫేస్ ప్రత్యక్షమైంది. ఆ సమయంలో పిల్లి హావభావాలు చూడటానికి భలే విచిత్రంగా ఉన్నాయి. ఆ ఎక్స్‌ప్రెషన్సే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వీడియోకు లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. అదే సమయంలో ఫన్నీ ఎమోజీలు కామెంట్స్ బాక్స్‌లో పెడుతున్నారు.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us