Optical Illusion: ఈ ఫోటోలో ‘8’ నెంబర్‌ను కనిపెట్టగలరా.? మంచి కిర్రాక్ పజిల్..

|

Sep 29, 2022 | 2:01 PM

మీ మెదడుకు పదునుపెట్టండి.. కళ్లకు పని చెప్పండి.. అంతే! ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు.

Optical Illusion: ఈ ఫోటోలో 8 నెంబర్‌ను కనిపెట్టగలరా.? మంచి కిర్రాక్ పజిల్..
Optical Illusion
Follow us on

లెక్కల మాస్టార్లూ లైన్‌లోకి వచ్చేయండి.. మీకోసం సరికొత్త పజిల్ తీసుకొచ్చేశాం. మీ మెదడుకు పదునుపెట్టండి.. కళ్లకు పని చెప్పండి.. అంతే! ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. రోజుకో చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్ నెటిజన్లను పలకరిస్తోంది. ఇవి మీ మైండ్‌ను బంతాట ఆడేస్తాయి. ఎవ్వరైనా సరే ఫన్‌తో పాటు కాస్త కంటెంట్ ‌ఉంటే.. అప్పుడు వచ్చే మజా వేరుగా ఉంటుందని అనుకుంటారు. సుడోకోలు, పద వినోదం ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. లేట్ ఎందుకు తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఆ పజిల్ ఏంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోలో మీకు ఎక్కడ చూసినా ‘9’ నెంబర్స్ కనిపిస్తాయి. అయితే అలా అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ ‘8’ నెంబర్ కూడా ఉంది. అదెక్కడుందో.! ఏ వరుసలో ఉందో.? మీరు చెప్పాలి. ఫోటోను పైపైన చూస్తే.. మీకు కనిపించదు. తీక్షణంగా చూస్తేనే గానీ మీకు ‘8’ నెంబర్ కనిపించదు. మీ కళ్లకు పెద్దవి చేసి చూడండి.. ఫోటో పజిల్ సాల్వ్ చేయండి.. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటో లుక్కేయండి.