Business Tips: వ్యాపారంలో ఈ వ్యసనాన్ని వదలివేయండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..

|

Oct 14, 2021 | 3:08 PM

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తన ఆలోచనను, తనకు నచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Business Tips: వ్యాపారంలో ఈ వ్యసనాన్ని వదలివేయండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..
Anand Mahindra Dog
Follow us on

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తన ఆలోచనను, తనకు నచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.  అంతేకాకుండా షేర్ చేసిన వీడియో ఓ అద్భుతమైన ట్యాగ్ లైన్ జోడిస్తుంటారు ఈ పారిశ్రామికవేత్త.  ఆనంద్ మహీంద్రా షేర్ చేసే కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆనంద్ మహీంద్రా చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతే కాదు ఆ పోస్టుకు ఆనంద్ మహీంద్ర చేసిన కామెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందులో బిజినెస్ టిప్ అంటూ పేర్కొనడం సంచలనంగా మారింది.

క్లేటన్ క్యూబిట్ అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక కుక్క కనిపిస్తుంది. మూసిన డోర్‌ను నెట్టడానికి ప్రయత్నిస్తోంది ఆ కుక్క. అయితే ఆ డోర్‌కు గ్లాస్ ఉందనుకున్న భావనలో నెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. గ్లాస్ లేనప్పటికీ.. గ్లాస్ ఉందనుకుని ఆ కుక్క టచ్ చేస్తూ కనిపిస్తుంది. కానీ అది తెరిచిన ఉన్న డోర్ అని అర్థం చేసుకోలేక పోతుంది.

కానీ అలవాటులో పొరపాటుగా ఆ కుక్క గాజు డోనును నెట్డడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. చివరలో కుక్క చేస్తున్న పనికి దాని యజమాని నవ్వుకున్నాడు. ఈ నేపథ్యంలో  ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటోంది. “అలవాటుగా మారిన మన వ్యాపార వ్యసనానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు.. ఈ రోజు వ్యాపారంలో అత్యంత విలువైన నైపుణ్యం.. అది పెంచుకోవడం చాలా అవసరం . ” అంటూ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..