
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆథిత్యం ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు భరాత్ వచ్చారు. అయితే వారు తమ భద్రతా నిమిత్తం తమ అధికారిక వాహనాలను కూడా వెంటతెచ్చుకున్నారు. వీటిలో అత్యంత ఖరీదైన, స్ట్రాంగైన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడి షీ జిన్‌పింగ్‌కు చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వ్లాదిమిర్ పుతిన్ వాడే ‘ఆరస్ సెనాట్’ కారు
మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ వాడుతున్న ఈ కారు పేరు “ఆరస్ సెనాట్ లిమోసిన్” ఈ కారును రష్యావారే రూపొందించారు. 2018 నుంచి పుతిన్ ఈ కారును వాడుతున్నారు. దీని ముందు రష్యా అధ్యక్ష భవనం అధికారిక కారైనా మెర్సిడెస్-బెంజ్ ఎస్ 600 గార్డ్ పుల్‌మన్ కారును వాడేవారు. దాని తర్వాత 2018లో ఆరస్ సెనాట్ లిమోసిన్‌ను పుతిన్ షిఫ్ట్ అయ్యారు. గతంలో ఎస్‌సీఓ సదస్సు సమయంలోనూ ప్రధాని మోదీ, పుతిన్ ఇద్దరూ కలిసి ఈ కారులోనే ప్రయాణించారు.
Putins Aurus Senat
ఆరస్ సెనాట్ కారు ప్రత్యేకలు ఇవే!
స్పెసిఫికేషన్లు: పుతిన్ వాడుతున్న ఈ కారును దేశియంగానే తయారు చేశారు. ఈ కారులో 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 హైబ్రిడ్ ఇంజిన్ ఉటుంది. ఇది 598 హార్స్‌పవర్, 880 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారులో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ మొడ్‌లు ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్స్ : ప్రపంచంలోకెళ్లా అత్యంత సేఫ్టీగా ఉండే కార్లలో ఇది కూడా ఒకటి. హై క్వాలిటీ బుల్లెట్లను, బాంబు పేలుళ్లను తట్టుకునేలా కారును డిజైన్‌ను రూపొందించారు. ఈ కారులో మందపాటి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, రన్-ఫ్లాట్ టైర్లు, కెమికల్ దాడులను సైతం తట్టుకునేలా ప్రత్యేక ఆక్సిజన్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఎలాంటి క్లిస్టమైన పరిస్ధితులలో కూడా లోపల ఉన్న వారికి సేఫ్టీని ఇస్తుంది.
లగ్జరీ: ఈ కారులోని డిజైన్ విషయానికి వస్తే ఇందులో రియర్ క్యాబిన్‌లో మసాజ్ సీట్లు, వర్క్ టేబుల్స్, రిఫ్రిజిరేటర్, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. ఈ కారు సాధారణ మోడల్ ధర సుమారు రూ. 2.5 కోట్లు వరకు ఉండొచ్చు. అయితే పుతిన్ వాడే ఈ ప్రత్యేక ప్రెసిడెన్షియల్ మోడల్ మాత్రం అమ్మకానికి అందుబాటులో లేదు.
షీ జిన్‌పింగ్ వాడే హాంగ్‌చీ N701 కారు
ఇక చైనా అధ్యక్షుడు షీ వాడుతున్న కారు పేరు “హాంగ్‌చీ N701” అయితే కారు పేరు వెనక మరో అర్థం కూడా ఉంది.. హాంగ్‌చీ అంటే చైనీస్ భాషలో ఎర్ర జెండా అని అర్థమట. 1958లో ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ ప్రారంభించిన ఈ బ్రాండ్ అప్పటి నుంచి చైనా నాయకులకు అధికారిక వాహనాలను అందిస్తోందట.
Xis Hongqi N701 Luxury Cars
హాంగ్‌చీ N701 కారు ప్రత్యేకతలు
షీ జిన్‌పింగ్ వినియోగించే ఈ N701 దాదాపు 18 అడుగుల పొడవు, 3 టన్నులకు పైగా బరువు ఉంటుంది. ఇందులో అత్యాధునిక కవచం, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, లైఫ్ సపోర్ట్, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ కారు ఇంజిన్, రక్షణకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను చైనా రహస్యంగా ఉంచింది.
హాంగ్‌చీ L5 తో భారత అనుబంధం
2019లో మహాబలిపురం పర్యటనలో షీ జిన్‌పింగ్ హాంగ్‌చీ L5 మోడల్‌ను ఉపయోగించారు. అలాగే 2025 టియాంజిన్ ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ కూడా ఇదే కారులో ప్రయాణించారు. ఈ L5 మోడల్ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే… దీని ధర సుమారు రూ.7 కోట్ల వరకు ఉండొచ్చు. ఇందులో 6.0-లీటర్ V12 ఇంజిన్‌తో 400 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తూ, గంటకు 210 కిమీ వేగంతో ప్రయాణించగలదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.