Brain Teaser: పజిల్స్ ఈ మధ్య నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ పజిల్స్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్(optical illusion) పజిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు కనిపించడమే వీటి స్టైల్. వీటిని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆన్సర్ చూశాక.. అరెరె ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి మీరు సృజనాత్మకను ఉపయోగించాలి. ఇచ్చిన పజిల్‌ను కొద్దిగా భిన్నంగా, ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చి విశ్లేషించాలి. ఎంత సేపు చెక్ చేసినా.. మన కళ్లను ఈ పజిల్స్ మోసం చేస్తూనే ఉంటాయి. మీరు కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచిస్తే మాత్రం వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. తాజాగా ఓ బ్రెయిన్ టీజర్ నెట్టింట వైరల్ అవుతుంది. పై చిత్రంలో, బస్సు ఏ దిశలో వెళుతుందో మీరు గుర్తించాలి. సమాధానం మీరు అనుకున్నంత సులువు కాదు కాబట్టి.. కాస్త ఆచి తూచి అంచనా వెయ్యండి. ఏంటి ఏం అర్థం కావట్లేదా..?. అలాగని కిందకు వెళ్లి వెంటనే ఆన్సర్ చూడకండి. అస్సలు కిక్ ఉండదు. మీ కోసం ఓ క్లూ ఇస్తాం. ఆ బస్సును డ్రైవర్ ఇండియన్ రోడ్స్‌లో నడుపుతున్నాడు. ఇది చెబితే చాలామందికి బల్బ్ వెలిగి ఉంటుంది. ఇక లేదంటే మాత్రం మేమే ఆన్సర్ చెప్పేస్తాం.
ఈ బ్రెయిన్ పజిల్లో, బస్సు కుడి వైపుకా లేదా ఎడమ వైపుకా.. ఎటువైపు కదులుతుందో మీరు చెప్పాలి. మీకు ఈ ఫోటోలో బస్ డోర్ కనిపించలేదు. అంటే బస్సు ఎడమవైపు కాకుండా “కుడి ” దిశలో వెళుతుందని అర్థం. ఎందుకంటే మన దగ్గర బస్సులకు డోర్స్ ఎడమ వైపు ఉంటాయి. వాహనాలు ఎడమవైపు డ్రైవ్ చేసే ఇండియా, యూకే వంటి దేశాల్లో ఇలా ఉంటుంది. కానీ రోడ్డుకు కుడి వైపున డ్రైవ్ చేసే US వంటి దేశాల్లో ఈ లాజిక్ రివర్స్ అవుతుంది. లాటరల్ థింకింగ్ చేయడం వల్ల ఇలాంటి గమ్మత్తైన పజిల్స్‌కు వెంటనే సమాధానాలు కనిపెట్టవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి