స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా బోట్‌స్వానా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు వివాదానికి దారితీశాయి. వేడుకల్లో ప్రజలకు విందు ఏర్పాటు చేసేందుకు 23 ఏనుగులను వేటాడి వాటి మాంసాన్ని ఉపయోగించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు
Botswana Faces Backlash Over Killing Of 23 Elephants For Feast

Updated on: Oct 05, 2026 | 6:42 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా బోట్‌స్వానా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు వివాదానికి దారితీశాయి. వేడుకల్లో ప్రజలకు విందు ఏర్పాటు చేసేందుకు 23 ఏనుగులను వేటాడి వాటి మాంసాన్ని ఉపయోగించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దక్షిణ ఆఫ్రికాలోని బోట్‌స్వానా.. ప్రపంచంలోనే అత్యధిక ఏనుగుల జనాభా ఉన్న దేశాల్లో ఒకటి. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల నేపథ్యంలోనే ఏనుగుల వేటకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ, పర్యాటక మంత్రిత్వ శాఖ 23 ఏనుగులతో పాటు మరికొన్ని అడవి జంతువులను వేటాడేందుకు అనుమతి ఇచ్చింది. వేడుకల్లో విందు కోసం మాంసాన్ని అందించడమే ఈ వేటకు ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షణ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏనుగులకు మరింత రక్షణ అవసరమని బోట్స్వానాకు చెందిన ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు ఓయిట్సే నావా వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో ఏనుగులను వేటాడి వాటి మాంసాన్ని ఉపయోగించడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వేటకు అధికారిక అనుమతి.. తప్పుడు సందేశం

ప్రభుత్వం అధికారికంగా ఏనుగుల వేటకు అనుమతిస్తే ఏనుగులను చంపడం తప్పు కాదనే భావన ప్రజల్లో, వేటగాళ్లలో పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వేట, పోచింగ్ ఇప్పటికే వన్యప్రాణులకు పెద్ద సమస్యగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు మరింత ఆందోళన కలిగిస్తాయనీ అంటున్నారు. ఏనుగుల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశం బోట్‌స్వానా. అలాంటి దేశంలోనే జాతీయ వేడుకల కోసం ఏనుగుల వేటకు అనుమతి ఇవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us