యూపీలో బూట్లతో కొట్టుకున్న బీజేపీ నేతలు.. వైరల్‌ అయిన వీడియో

| Edited By:

Mar 09, 2019 | 8:52 PM

లక్నో : ఓ ప్రాజెక్ట్ కార్యక్రమ శిలాఫలకంపై తన పేరు లేదంటూ సాటి ప్రజాప్రతినిధిపై బూటుతో దాడి చేశారు బీజేపీ ఎంపీ. ఉత్తరప్రదేశ్ లోని కరీబ్ నగర్ లో జరిగిన పర్యవేక్షణ కమిటి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ మధ్య మాటామాటా పెరిగి.. దాడులకు దిగారు. కోపం తెచ్చుకున్న ఎంపీ.. బూటుతో ఎమ్మెల్యేను చితక్కొట్టారు. […]

యూపీలో బూట్లతో కొట్టుకున్న బీజేపీ నేతలు.. వైరల్‌ అయిన వీడియో
Follow us on

లక్నో : ఓ ప్రాజెక్ట్ కార్యక్రమ శిలాఫలకంపై తన పేరు లేదంటూ సాటి ప్రజాప్రతినిధిపై బూటుతో దాడి చేశారు బీజేపీ ఎంపీ. ఉత్తరప్రదేశ్ లోని కరీబ్ నగర్ లో జరిగిన పర్యవేక్షణ కమిటి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ మధ్య మాటామాటా పెరిగి.. దాడులకు దిగారు. కోపం తెచ్చుకున్న ఎంపీ.. బూటుతో ఎమ్మెల్యేను చితక్కొట్టారు. దీంతో తిరగబడిన ఎమ్మెల్యే ఎంపీని కూడా రెండు దెబ్బలు వేశారు. వారిద్దరి మధ్యనే మంత్రి అశుతోష్ టండన్ కూర్చుని ఉన్నారు. ఆయన సమక్షంలో వీరిద్దరూ బాహాబాహికి తిగడం విశేషం. సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎంపీ.. బూటుతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రాజెక్ట్ కార్యక్రమ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో ఎంపీ శరద్ త్రిపాఠీ తీవ్రంగా ఆగ్రహించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అయిన రాకేశ్ సిన్హ్‌తో మాటా మాటా పెరిగింది. కోపంతో కాలికున్న బూటు తీసి.. ఎమ్మెల్యేపై ఎంపీ దాడికి దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మల్యే అనుచరులు.. ఎంపీని కలెక్టర్ రూమ్‌లో బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఎమ్మెల్యే మద్దతురాలు ఎంపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.