Viral Video: వాటర్ బాటిల్‌ ఎంత పని చేసింది.. వాహనాలపై దూసుకెళ్లిన బస్సు

|

Aug 13, 2024 | 6:32 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ బస్సు విధ్వంసం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికిగాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఓ ఓల్వో బస్సు బెంగళూరు సిటీలోని ఓ ఫ్లై ఓవర్‌ పైన్‌ నుంచి వెళ్తోంది. అయితే అదే సమయంలో వాహనం ఒక్కసారిగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయింది...

Viral Video: వాటర్ బాటిల్‌ ఎంత పని చేసింది.. వాహనాలపై దూసుకెళ్లిన బస్సు
Viral Video
Follow us on

కారు లేదా నడిపించే సమయంలో బ్రేక్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా బ్రేక్‌ పెడల్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటుంటారు. బ్రేక్‌ పెడల్ నొక్కే సమయంలో కింద ఏదైనా వస్తువు ఉంటే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. బ్రేక్‌ సరిగ్గా పడక ఘోర ప్రమాదానికి దారి తీస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే బెంగళూరులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ బస్సు విధ్వంసం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికిగాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఓ ఓల్వో బస్సు బెంగళూరు సిటీలోని ఓ ఫ్లై ఓవర్‌ పైన్‌ నుంచి వెళ్తోంది. అయితే అదే సమయంలో వాహనం ఒక్కసారిగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయింది. ట్రాఫిక్‌లో బ్రేక్‌ పడకపోవడంతో బస్సు ఎదురుగా ఉన్న వాహనాల మీదికి దూసుకుపోయింది.

వైరల్ వీడియో..

అసలు ఏం జరిగిందో తెలియక డ్రైవర్ కాసింత గందగరోళానికి గురయ్యాడు. దీంతో వెంటనే మస్సులో ఉన్న డ్రైవర్‌ వచ్చి. ఏమైంది బ్రేక్‌ ఎందుకు వేయడం లేదన్నట్లు సైగ చేశాడు. ఇదంతా బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. అయితే బస్సు వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రాణ నష్టం జరగలేదని చెప్పాలి. పొరపాటున బస్సు వేగంలో ఉండుంటే నష్టం మాటల్లో చెప్పడం కష్టం. అయితే బ్రేక్‌ పెడల్‌ కింద ఒక వాటర్‌ బాటిల్ వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇదంతా బస్సులో ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ్‌ వైరల్‌ అవుతోంది. ఈ ప్రమాదంపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..