‘బుల్లి వంటగాడు’.. ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడు..!

| Edited By:

May 26, 2020 | 2:12 PM

ఏడాది బుడ్డోడు.. ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడు. తన చిట్టి చిట్టి చేతులతో బటర్ చికెన్ మొదలు నాన్, మాక్, చీజ్ ఇలా ఫుడ్ వెరైటీలు చేసి (తల్లిదండ్రుల సహాయంతో) నెటిజన్ల చేత వావ్ అనిపిస్తున్నాడు

బుల్లి వంటగాడు.. ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడు..!
Follow us on

ఏడాది బుడ్డోడు.. ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడు. తన చిట్టి చిట్టి చేతులతో బటర్ చికెన్ మొదలు నాన్, మాక్, చీజ్ ఇలా ఫుడ్ వెరైటీలు చేసి (తల్లిదండ్రుల సహాయంతో) నెటిజన్ల చేత వావ్ అనిపిస్తున్నాడు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్‌ చేసి నెలలు కూడా గడవకముందే ఆ బుడ్డోడికి 1.5 మిలియన్ మంది ఫాలోవర్లుగా మారిపోయారు. చిన్న చిన్న వెరైటీలు చేయడంతో పాటు వాటిని టేస్ట్ చేస్తూ ఆ బుడ్డోడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో వాడికి ‘చెఫ్ కోబ్’ అంటూ బిరుదును కూడా ఇచ్చేశారు. కొందరేమో కొన్ని వంటల పేర్లను చెబుతూ ఎలా చేయాలో చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ బుడ్డోడి పేరు కోబ్. ఫిబ్రవరి చివర్లో ఈ బుడ్డోడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఏప్రిల్ 15వరకు కోబ్‌కి కేవలం 200 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు, ఆ తరువాత పెరుగుతూ వచ్చారు. అంతేకాదు ట్విట్టర్ సంస్థ ఈ చిన్నోడికి టిక్ మార్క్‌ కూడా ఇచ్చేసింది.

Read This Story Also: భారత్‌కి మరో గండం.. ఆందోళనలో అధికారులు..!