భారీ వర్షంలో కూడా తడుస్తూ డ్యూటీ చేసిన ట్రాఫిక్ పోలీస్

| Edited By: Anil kumar poka

Apr 02, 2019 | 1:36 PM

అస్సాం: గౌహతిలో మిధున్ దాస్ అనే ట్రాఫిక్ పోలీస్ కు సోషల్ మీడియాలో భారీగా ప్రశంసలు లభిస్తున్నాయి. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బసిస్టా జంక్షన్ ప్రాంతంలో ఆదివారం భారీ వర్షం కురుస్తున్న సమయంలో అతను డ్యూటీ చేశారు. కనీసం రెయిన్ కోట్ కూడా ధరించకుండా తడుస్తూనే విధులు నిర్వహిస్తూ వృత్తి పట్ల నిబద్ధతను మిధున్ చాటుకున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన వర్షంలో తడుస్తూనే డ్యూటీ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం […]

భారీ వర్షంలో కూడా తడుస్తూ డ్యూటీ చేసిన ట్రాఫిక్ పోలీస్
Follow us on

అస్సాం: గౌహతిలో మిధున్ దాస్ అనే ట్రాఫిక్ పోలీస్ కు సోషల్ మీడియాలో భారీగా ప్రశంసలు లభిస్తున్నాయి. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బసిస్టా జంక్షన్ ప్రాంతంలో ఆదివారం భారీ వర్షం కురుస్తున్న సమయంలో అతను డ్యూటీ చేశారు. కనీసం రెయిన్ కోట్ కూడా ధరించకుండా తడుస్తూనే విధులు నిర్వహిస్తూ వృత్తి పట్ల నిబద్ధతను మిధున్ చాటుకున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన వర్షంలో తడుస్తూనే డ్యూటీ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన నిజాయితీ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.