మరీ ఇంత ఫ్రస్ట్రేషనా ? ఆ రష్యన్ ఏం చేశాడో తెలిస్తే…షాక్ తినాల్సిందే !

|

Dec 26, 2019 | 12:35 PM

రష్యాలో మొరోజ్ ఇగోర్ అనే వ్యక్తికి కోపం ఎక్కువ. అలాగే… అంతే పాళ్ళలో విసుగూ ఎక్కువే.. తన ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక నానా అవస్థా పడుతుంటాడు. దీన్ని ఈ మధ్య ‘ మరో స్థాయికి ‘ తీసుకువెళ్లాడు. ఖరీదైన.. రెండు లక్షల 70 వేల డాలర్ల విలువైన తన మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ… జీ 63ని నింగిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ నుంచి కింద పడేశాడు. భూమికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తున హెలికాఫ్టర్ ఎగురుతుండగా.. ఆ వాహనాన్ని కిందకు […]

మరీ ఇంత ఫ్రస్ట్రేషనా ? ఆ రష్యన్ ఏం చేశాడో తెలిస్తే...షాక్ తినాల్సిందే !
Follow us on

రష్యాలో మొరోజ్ ఇగోర్ అనే వ్యక్తికి కోపం ఎక్కువ. అలాగే… అంతే పాళ్ళలో విసుగూ ఎక్కువే.. తన ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక నానా అవస్థా పడుతుంటాడు. దీన్ని ఈ మధ్య ‘ మరో స్థాయికి ‘ తీసుకువెళ్లాడు. ఖరీదైన.. రెండు లక్షల 70 వేల డాలర్ల విలువైన తన మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ… జీ 63ని నింగిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ నుంచి కింద పడేశాడు. భూమికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తున హెలికాఫ్టర్ ఎగురుతుండగా.. ఆ వాహనాన్ని కిందకు జారవిడిచాడు. అసలు ఈ వాహనమంటే అతగాడు ,మండిపోవడానికి వెనుక ఓ ‘ చిన్న కథే ‘ ఉంది. ఎప్పటినుంచో ఇలాంటి ఖరీదైన వాహనాన్ని కొనాలనే డ్రీమ్ ఇతనికి ఉండేదట.. ఎలాగైతేనేం ? గత ఏడాది మార్చిలో ఈ వాహనాన్ని కొన్నాడు. అయితే అప్పటినుంచి ఇతనికి కష్టాలు మొదలయ్యాయి. ఆ వాహనమే ఇతనికి ఓ పీడకలగా పరిణమించింది. కొన్నప్పటి నుంచి దానికి ఒకటే మరమ్మతులు.. సర్వీసింగ్ మెకానిక్ కూడా ఇక దీనికి తాను రిపేర్ చేయలేనని చేతులెత్తేశాడట.. చాలా సందర్భాల్లో దీని విషయమై ఇగోర్, మెకానిక్ మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి.

ఇంతేకాదు. ఓ కాంట్రాక్ట్ విషయంలో ఇతనికి, ఇతని స్నేహితునికి మధ్య వివాదం తలెత్తింది. ఆ ఒప్పందంలో తాను ఓడిపోతే.. తన మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని వెరైటీగా నాశనం చేస్తానని ఇగోర్ తన స్నేహితునితో పందెం కట్టాడు. అన్నట్టే ఆ పందెంలో ఓడిపోవడంతో తన ప్రామిస్ ప్రకారం.. ఆ వాహనాన్ని ఇలా నాశనం చేశాడు. ఈ ‘ పనికి ‘ అనువుగా ఈ ఇద్దరి స్నేహితుల కోర్కెను తీర్చడానికి ఓ చిన్న విమానాశ్రయాన్ని కేటాయించేందుకు రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు కూడా అంగీకరించారు. ఓ రోజు మంచు కురుస్తున్న వేళ.. ఇగోర్ తన ప్రామిస్ నెరవేర్చుకుని.. ఆ వాహనాన్ని వదిలించుకున్నాడు. హెలికాఫ్టర్ నుంచి కింద పడిపోయిన ఆ బెంజ్ వాహనం కొన్ని నిముషాల్లోనే నాశనమైంది. ఈ వీడియోకు 13 లక్షల వ్యూస్ లభించాయి. అంతా ఆయ్యాక.. తీరిగ్గా.. పోలీసులు వచ్చి ఈ యవ్వారం మీద దర్యాప్తు మొదలెట్టారు.