పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా సెటైర్లు వేశారు. ఇమ్రాన్ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసిన మహీంద్రా.. ‘‘దేవుడి దయవల్ల ఈ వ్యక్తిని నాకు చరిత్ర, భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవ్వలేదు’’ అని కామెంట్ చేశారు. కాగా ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్.. జపాన్, జర్మనీ దేశాలు రెండు ఒకే సరిహద్దును కలిగి ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇమ్రాన్ చెప్పిన ఆ కామెంట్లకు ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. ఇక ఈ వీడియో ఈ ఏడాది మొదట్లో ఓ సమావేశంలో మాట్లాడినది కాగా.. అప్పట్లో కూడా ఆయనపై నెటిజన్లు ఫుల్ కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు మహీంద్రా ట్వీట్‌తో మరోసారి ఆ వీడియో వైరల్‌గా మారగా.. అందరి చేత నవ్వులు పూయిస్తోంది. అయితే ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ నోరు జారడం ఇది మొదటి సారేం కాదు. గతంలో పలుమార్లు నోరు జారి విమర్శల పాలయ్యారు.
Thank you Oh Lord, for ensuring that this gentleman was not my History or Geography teacher…? pic.twitter.com/cIGxX0UdSh
— anand mahindra (@anandmahindra) August 25, 2019