ఎంత గొప్ప మ‌న‌సో‌…యాచ‌కురాలిని పెళ్లాడిన యువ‌కుడు..

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 9:32 AM

ప్రేమకు ఎటువంటి తార‌త‌మ్యాలు ఉండ‌వ‌ని మ‌రోసారి తేలిపోయింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో పుట్టిన వారి క‌ల్మ‌శం లేని ప్రేమ..పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లింది. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్ వల్ల ఫుడ్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ యాచకులకు.. చపాతీలు పంచడానికి వెళ్లిన యువకుడు వారిలో ఓ అమ్మాయిని చూసి ల‌వ్ లో పడ్డాడు. ఆమె కూడా అతడిపై ఇష్టాన్ని ప్ర‌క‌టించ‌డంతో పెద్దలు పెళ్లి జరిపించేశారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఈ పెళ్లి జ‌రిగింది. వివ‌రాల్లోకి […]

ఎంత గొప్ప మ‌న‌సో‌...యాచ‌కురాలిని పెళ్లాడిన యువ‌కుడు..
Follow us on

ప్రేమకు ఎటువంటి తార‌త‌మ్యాలు ఉండ‌వ‌ని మ‌రోసారి తేలిపోయింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో పుట్టిన వారి క‌ల్మ‌శం లేని ప్రేమ..పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లింది. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్ వల్ల ఫుడ్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ యాచకులకు.. చపాతీలు పంచడానికి వెళ్లిన యువకుడు వారిలో ఓ అమ్మాయిని చూసి ల‌వ్ లో పడ్డాడు. ఆమె కూడా అతడిపై ఇష్టాన్ని ప్ర‌క‌టించ‌డంతో పెద్దలు పెళ్లి జరిపించేశారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఈ పెళ్లి జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళ్తే…. అనిల్ అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఆహారం దొర‌క్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అత‌డు సాయం చేస్తూ ఉండేవాడు. అదే క్ర‌మంలో ఇటీవ‌ల ఓ బ్రిడ్జి కింద‌ తలదాచుకుంటున్న యాచకులకు ఫుడ్ ప్యాకెట్లు అందించాడు. వారిలో నీలం అనే యువతిపై అతడు మ‌న‌సు ప‌డ్డాడు. స‌ద‌రు యువ‌తి తల్లిదండ్రులు లేరు. మేనమామ ద‌గ్గ‌రే ఉంటూ బ్ర‌తుకు వెళ్ల‌దీస్తోంది. ఆమె క‌ష్ట ప‌డుతోన్న తీరు కూడా అనిల్ ప్రేమ‌కు కార‌ణ‌మైంది. ఇరువురి అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో లాక్‌డౌన్ కాస్తా..వెడ్ లాక్ గా మారిపోయింది. ఈ విషయం అనిల్ పనిచేసే కంపెనీ యజమాని లలిత్ ప్రసాద్ కు తెలియ‌డంతో..మంచి ప‌నిచేశావ‌ని, నీలంను బాగా చూసుకోవాలని కోరాడు. ఈ పెళ్లికి అనిల్ అమ్మానాన్న‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యినా అత‌డు వెన‌క్కి త‌గ్గ‌లేదు. లలిత్ రంగంలో దిగి మంచిచెడ్డ‌లు చెప్పి, పెళ్లికి పెద్దలను ఒప్పించాడు. దీంతో ఇటీవ‌లే ఈ జంట పెళ్లిపీట‌లెక్కారు. ఆమెకు కేవలం ఆహారమే కాదు, త‌న‌ జీవితాన్ని కూడా పంచి ఇచ్చాడని జనం అనిల్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.