
మారుతున్న అత్యాధునిక పోకడలు, మానవ తప్పిదాలు, పట్టణీకరణ, ఆక్రమణల వల్ల అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుల స్వార్థంతో అటవీ సంపద నాశనమవుతోంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక వన్యప్రాణుల జాతులు ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాలలోకి వస్తున్నాయి. సాధారణంగా, అప్పుడప్పుడు వాటి చూసిన జనం భయాందోళనలకు గురవుతుంటారు. వన్య మృగాలను చూస్తే జనం పారిపోతారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అది ఆశ్చర్యం కలిగించడమే కాకుండా కొంత ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది. ఒక క్రూరమైన బెంగాల్ టైగర్ అకస్మాత్తుగా మానవ నివాసంలోకి ప్రవేశించింది. ఆ తరువాతి దృశ్యం ప్రజలను దిగ్భ్రాంతికి, కలవరానికి గురి చేస్తుంది.
అడవి నుండి మానవ నివాస స్థలంలోకి ఒక బెంగాల్ టైగర్ వచ్చింది. దర్జాగా రోడ్డును దాటుతూ.. అటు ఇటు తిరుగుతూ కనిపించింది. దీనిని చూసిన కొంతమంది వీడియో చిత్రీకరించడం ప్రారంభించారు. అయితే, ఒక వ్యక్తి తాడుతో పులి వద్దకు వెళ్లి దాని మెడలో వేసి కుక్క పిల్ల మాదిరిగా తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, పులి అతనిపై దాడి చేయలేదు, బదులుగా నిశ్శబ్దంగా అతనితోపాటు వెళ్ళిపోయింది. బెంగాల్ టైగర్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాంసాహారులలో ఒకటిగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దృశ్యాన్ని చూసి ఎవరు ఆశ్చర్యపోరు? ఈ వీడియో మెక్సికో లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @AnimalGeoLife అనే IDతో షేర్ చేయడం జరిగింది. ‘మెక్సికోలోని టెకీలాలో ఒక అద్భుతమైన దృశ్యం, ఒక బెంగాల్ టైగర్ నగరం చుట్టూ హాయిగా తిరుగుతోంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లారు’ అని క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ 31 సెకన్ల వీడియోను 3,41,000 సార్లు వీక్షించారు, 6,000 మందికి పైగా దీనిని లైక్ చేసి వివిధ స్పందనలు తెలిపారు. ఒక వినియోగదారు, “అతను స్థానికుడు, “అది పెంపుడు పులి అయి ఉండాలి, అందుకే అది ఆ మనిషికి హాని కలిగించలేదని అన్నారు.
వీడియోను ఇక్కడ చూడండిః
Incredible sight in Tecuala, Mexico as a Bengal Tiger casually strolls through town before being safely taken home without a fuss! pic.twitter.com/Av1YAXqh9T
— Nature is Phenomenal (@AnimalGeoLife) March 2, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..