Crime News: బేస్ బాల్ బ్యాట్‌తో భార్యను చితకొట్టిన భర్త.. వీడియో వైరల్

|

Apr 17, 2024 | 6:57 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. స్థానికంగా జరిగిన విషయాలను.. వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అవుతాయి. అలా వైరల్ అయిన వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భర్తను బేస్ బాల్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియోను అక్కడున్నవారు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో..

Crime News: బేస్ బాల్ బ్యాట్‌తో భార్యను చితకొట్టిన భర్త.. వీడియో వైరల్
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. స్థానికంగా జరిగిన విషయాలను.. వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అవుతాయి. అలా వైరల్ అయిన వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భర్తను బేస్ బాల్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియోను అక్కడున్నవారు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

కారులో నుంచి భార్యను లాక్కొచ్చి..

హర్యానాలోని పంచకులలోని సెక్టార్ 26లోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న తన భర్తను అడ్డంగా కారు ఆపి మరీ.. కారుపై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత కారులో ఉన్న మహిళను బయటకు లాక్కొచ్చి.. బేస్ బాల్ బ్యాట్‌తో దారుణంగా కొట్టాడు. ఇదంతా.. అక్కడున్న స్థానికులు వీడియో తీశారు. సదరు మహిళ కొట్టొద్దని వారిస్తూ ఉన్నా.. ఆ వ్యక్తి వినిపించుకోకుండా కొడుతూనే ఉన్నాడు. వేరే వ్యక్తితో కలిసి కారులో వెళ్తుందని.. నడి రోడ్డుపై భార్యను కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అనంతరం కారులో ఉన్న వ్యక్తి కూడా దిగి.. ఎందుకు కొడుతున్నావ్? అని అడుగుతున్నాడు. అలాగే స్థానికులు కూడా వారిస్తున్నా.. ఆ వ్యక్తి వినకుండా.. భార్యపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నాడు.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నడిరోడ్డుపై భార్యను అవమానించడం దారుణం అని ఓ నెటిజన్ అంటే.. ఏమైనా ఉంటే సామరస్యంగా తేల్చుకోవాలని మరొకరు అన్నారు. ఏది ఏమైనా రోడ్డుపై అలా విచక్షణా రహితంగా భార్యను కొట్టడం తప్పని మరో నెటిజన్ అన్నాడు. ఇలా మొత్తానికి ఈ వీడియో వైరల్‌గా మారింది.