Viral Video: చెట్టు దగ్గరలో కనిపించిన పెద్ద సైజు గుడ్లు.. ఏంటని చూడగా షాకైన జనాలు.. కట్ చేస్తే!

|

Aug 26, 2022 | 12:05 PM

ఓ చెట్టు దగ్గర పెద్ద సైజ్‌లో గుడ్లు కనిపించాయి. మొదటిగా వాటిని పెద్దగా పట్టించుకోకపోగా.. అవి పాము గుడ్ల వలె ఉండటంతో..

Viral Video: చెట్టు దగ్గరలో కనిపించిన పెద్ద సైజు గుడ్లు.. ఏంటని చూడగా షాకైన జనాలు.. కట్ చేస్తే!
Representative Image
Follow us on

ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఊరు శివారులో ఉన్న ఓ చెట్టు దగ్గర పెద్ద సైజ్‌లో గుడ్లు కనిపించాయి. మొదటిగా వాటిని పెద్దగా పట్టించుకోకపోగా.. అవి పాము గుడ్ల వలె ఉండటంతో.. వారికి డౌట్ వచ్చింది. ఆ చుట్టుప్రక్కల భారీ పాము ఒకటి తిరుగుతుండవచ్చునని అర్ధమైంది. దాని వల్ల గ్రామస్తులకు ఎప్పటికైనా ప్రమాదమేనని పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అజంఘర్‌‌కు సమీపంలోని ఓ గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టు దగ్గర పెద్ద సైజ్‌లో గుడ్లు కనిపించడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. అవి చూడటానికి పాము గుడ్ల వలె ఉండటంతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. స్పాట్‌కు చేరుకున్న మురళీవలే అనే స్నేక్ క్యాచర్.. ఆ చెట్టు దగ్గరలో ఉన్న మట్టిలో దాగున్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని బంధించాడు. ఆ తర్వాత తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. కాగా, ఆ భారీ కొండచిలువను చూసేందుకు స్థానిక జనాలు తండోపతండాలుగా చేరుకోవడం గమనార్హం.