Viral Video: ఏం అదృష్టం రా సామీ.. కళ్ల ముందు చావును 3డీ లో చూశావుగా.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 4:33 PM

Viral Video: రాసి పెట్టుండాలే కానీ చావు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా ప్రాణాలను దక్కించుకోవచ్చు. ఈ భూమిపై నూకలు మిగిలుంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. నెట్టింట వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలను...

Viral Video: ఏం అదృష్టం రా సామీ.. కళ్ల ముందు చావును 3డీ లో చూశావుగా.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
Follow us on

Viral Video: రాసి పెట్టుండాలే కానీ చావు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా ప్రాణాలను దక్కించుకోవచ్చు. ఈ భూమిపై నూకలు మిగిలుంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. నెట్టింట వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలను చూస్తుంటే ఇది ముమ్మాటికీ నిజమనిపించక మానదు. సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఏం జరిగినా ప్రపంచానికి తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

జపాన్‌ దేశంలో ఓ వ్యక్తి కారులో రోడ్డుపై వెళుతున్నాడు. అదే సమయంలో ఓ జంక్షన్‌ దగ్గరికి వచ్చే సమయానికి అక్కడ సిగ్నల్‌ పడింది. దీంతో సదరు కారులో ఉన్న వ్యక్తి నెమ్మదిగా కారును మూవ్‌ చేశాడు. అయితే అదే సమయంలో ఉన్నట్లుండి పైనుంచి ఓ పెద్ద స్థంభం కింద పడింది. కారు ముందు భాగంలో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కారు ముందు పార్ట్‌ నుజ్జునుజ్జైంది. సహజంగా అయితే కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయమని అందరూ భావిస్తారు.

కానీ స్థంభం పడిన కాసేపటికి కారులో వ్యక్తి నెమ్మదిగా తల పైకి లేపి బయటకు వచ్చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌కావడంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

వైరల్‌ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..