ఆమె చేస్తున్నది టిక్‌టాక్ కాదు.. వైరల్‌గా మారిన వీడియో

| Edited By:

Aug 02, 2019 | 12:49 PM

మనం బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడో, లేక బస్టాపులో ఉన్నప్పుడో అప్పుడప్పుడు కొంతమంది ఎదురవుతుంటారు. తమ ఫోన్ చూస్తూ ఏవేవో సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. వారిని మనం వింతగా చూస్తుంటాం. అయితే చెవులుండీ వినబడక, నోరుండీ మాటలు రాక .. బదిరులుగా మిగిలిపోయిన వారికి ఈ స్మార్ట్ ఫోన్ ఒక వరంగా మారింది. తమలాంటి స్నేహితులతో నేరుగా వీడియోకాల్ చేసుకుని మాట్లాడుకుంటూ తమ భావాలను వ్యక్తం చేస్తుంటారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. కానీ […]

ఆమె చేస్తున్నది టిక్‌టాక్  కాదు.. వైరల్‌గా మారిన వీడియో
Follow us on

మనం బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడో, లేక బస్టాపులో ఉన్నప్పుడో అప్పుడప్పుడు కొంతమంది ఎదురవుతుంటారు. తమ ఫోన్ చూస్తూ ఏవేవో సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. వారిని మనం వింతగా చూస్తుంటాం. అయితే చెవులుండీ వినబడక, నోరుండీ మాటలు రాక .. బదిరులుగా మిగిలిపోయిన వారికి ఈ స్మార్ట్ ఫోన్ ఒక వరంగా మారింది. తమలాంటి స్నేహితులతో నేరుగా వీడియోకాల్ చేసుకుని మాట్లాడుకుంటూ తమ భావాలను వ్యక్తం చేస్తుంటారు.

టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. కానీ ఇలాంటి దివ్యాంగులు దాన్ని సద్వినియోగా చేసుకోవడం ఆలోచింపజేస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ముంబై రైల్వే స్టేషన్‌లో కనిపించింది. ఓ యువతి తన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని అదేపనిగా సైగలు చేస్తూ కనిపించింది. ఈ దృశ్యం చూస్తున్న వారంతా ఆమె టిక్‌టాక్ వీడియో చేస్తుందేమో అనుకున్నారు. కానీ అమెకు మాటలు రావని, అమె బదిర యువతి అని మాత్రం తెలియదు. ఇదే దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్‌లో షూట్ చేసి ఇన్‌స్టాగ్రాం లో పోస్ట్ చేశాడు. “టెక్నాలజీ నీకు ధన్యవాదాలు. ఇన్నాళ్లు వీడియో కాలింగ్‌ యాప్‌లు కేవలం యువతకే అనుకున్నా, కానీ ఈ రోజూ దాని ఉపయోగం ఏంటో చూశా” అంటూ కామెంట్ కూడా రాశాడు. దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.