డోర్‌పై నక్కిన స్నేక్… చటుక్కున కాటేసింది

| Edited By:

May 09, 2019 | 1:21 PM

అమెరికాలోని ఓక్లాహామాలో మిత్రుని కలిసి వెళ్దామని వచ్చిన ఓ వ్యక్తికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. డోర్ బెల్ కొట్టగానే… అక్కడే నక్కి ఉన్న ఓ పాము ఆ వ్యక్తిని కాటేసింది. జెరెల్ హేవుడ్ అనే వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు రోడ్నీ కోప్‌ల్యాండ్‌ను చూడటానాకి ఓక్లాహామాలోని లాటన్‌కు వెళ్లాడు. కారు దిగి కోప్ ల్యాండ్ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్ కొట్టగానే మొహంపై పాము కాటు వేసింది. సరిగ్గా కుడికన్నుపై భాగంలో కోరలు దించింది. పాము కోరలు […]

డోర్‌పై నక్కిన స్నేక్... చటుక్కున కాటేసింది
Follow us on

అమెరికాలోని ఓక్లాహామాలో మిత్రుని కలిసి వెళ్దామని వచ్చిన ఓ వ్యక్తికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. డోర్ బెల్ కొట్టగానే… అక్కడే నక్కి ఉన్న ఓ పాము ఆ వ్యక్తిని కాటేసింది. జెరెల్ హేవుడ్ అనే వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు రోడ్నీ కోప్‌ల్యాండ్‌ను చూడటానాకి ఓక్లాహామాలోని లాటన్‌కు వెళ్లాడు. కారు దిగి కోప్ ల్యాండ్ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్ కొట్టగానే మొహంపై పాము కాటు వేసింది. సరిగ్గా కుడికన్నుపై భాగంలో కోరలు దించింది. పాము కోరలు గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ముఖంపై తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఇంటి లోపల ఉన్న కోప్‌ల్యాండ్ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి సుత్తితో పామును చంపేశాడు. నా ఫ్రెండ్‌ను కాటేయడం.. సీసీ కెమెరాలో చూసి షాకయ్యాను. హే వుడ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. కోప్‌ల్యాండ్ తెలిపారు. అయితే హేవుడ్‌ని పాము కాటేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.