Viral Video: సముద్రంలోకి దూకబోయిన మహిళ, అంతలోనే దేవుడిలా వచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌.. షాకింగ్ వీడియో

|

Aug 17, 2024 | 6:13 PM

కష్టాల్లో ఉన్న వారిని రక్షించేవాడే నిజమైన హీరో. లాంటి నిజమైన హీరోగా నిలిచాడు ముంబయికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌. ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఒంటిచేత్తో కాపాడి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. క్యాబ్‌ డ్రైవర్‌ నిజంగానే దేవుడంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు...

Viral Video: సముద్రంలోకి దూకబోయిన మహిళ, అంతలోనే దేవుడిలా వచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌.. షాకింగ్ వీడియో
Viral Video
Follow us on

కష్టాల్లో ఉన్న వారిని రక్షించేవాడే నిజమైన హీరో. లాంటి నిజమైన హీరోగా నిలిచాడు ముంబయికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌. ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఒంటిచేత్తో కాపాడి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. క్యాబ్‌ డ్రైవర్‌ నిజంగానే దేవుడంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని ములుంద్‌ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రీమా ముకేశ్ అనే మహిళా ఆత్మహత్య చేసుకోవడానికి ముంబయిలోని అటల్‌ సేతు బ్రిడ్జిపైకి చేరుకుంది. ముందుగా బ్రిడ్జ్‌ సేఫ్టీ బారియర్‌పు కూర్చుంది. తొలుత సముద్రంలోకి ఏవో వస్తువులు విసురుతూ ఉంది. అది గమనించిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఆ మహిళ ఉన్న చోటు పక్కనే కారు ఆపి నిల్చున్నాడు. అయితే కాసేపు సరదాగా గడిపిన ఆ మహిళ ఉన్నపలంగా సముద్రంలోకి దూకబోయింది.

దీంతో వెంటనే అది గమనించిన క్యాబ్ డ్రైవర్‌ మహిళ జుట్టును, చేతుల్ని ఒక్కసారిగా గట్టిగా బడిసిపడుకున్నాడు. అంతలోనే దగ్గర్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గమనించి వెంటనే వాహనాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

వైరల్ వీడియో..

ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను ముంబయి పోలీసులు ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మహిళ చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఇక మరికొందరు దేవుడిలా వచ్చి మహిళ ప్రాణాలను కాపాడిన క్యాబ్‌ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అటల్‌ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..