Viral Video: ‘వయసు 80.. మనసు మాత్రం 20’.. అమితమైన ప్రేమకు ప్రతిరూపం ఈ వృద్ధ జంట. వైరల్‌ వీడియో..

|

Sep 09, 2021 | 1:37 PM

Viral Video: వృద్ధాప్యం శరీరానికే కానీ.. మనసుకు కాదని చెబుతుంటారు. కొందరు 40 ఏళ్లు దాటగానే అంతా అయిపోయిందంటూ నిరుత్సాహపడుతుంటారు. ఇంకా చేసేదేముందు, ఈ జీవితం ఇంతే...

Viral Video: వయసు 80.. మనసు మాత్రం 20.. అమితమైన ప్రేమకు ప్రతిరూపం ఈ వృద్ధ జంట. వైరల్‌ వీడియో..
Follow us on

Viral Video: వృద్ధాప్యం శరీరానికే కానీ.. మనసుకు కాదని చెబుతుంటారు. కొందరు 40 ఏళ్లు దాటగానే అంతా అయిపోయిందంటూ నిరుత్సాహపడుతుంటారు. ఇంకా చేసేదేముందు, ఈ జీవితం ఇంతే అంటూ ఎప్పుడూ ఏదో నిరుత్సాహంతో ఉంటారు. కానీ వయసు అనే కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనసుకు ముసలితనం ఉండదని చాటి చెబుతుంటారు కొందరు. ఎంత వయసొచ్చినా సంతోషంగా జీవిస్తూ నిత్య యవ్వనంగా ఉంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి ప్రత్యేక్ష ఉదాహారణగా నిలుస్తోంది.

ఇటీవలి కాలంలో ‘బుల్లెట్టు బండి’ పాట ఎంతలా పాపుల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. తెలంగాణ పాలమూరుకు చెంది లక్ష్మణ్‌ అనే రచయిత రాసిన ఈ పాటను మోహన భోగరాజు పాడడతంతో పాటు అందులో నటించారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడో సంచలనం. ఏ వివాహ వేడుక చూసినా ఈ పాటకు స్టెప్పులు వేయాల్సిందే. సిరిసిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు ఈ పాటకు పెళ్లి బరాత్‌లో స్టెప్పులు వేయడంతో మరింత పాపులర్‌ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇదే పాటకు ఓ భామ్మ స్టెప్పులు వేసింది. 80 ఏళ్ల వయసులోనూ ఉషారుగా స్టెప్పుల్లేస్తూ భర్త ముందు చిందులు వేసింది. భర్త ముందు జోష్‌గా స్టెప్పులు వేస్తూ.. తన ప్రేమను చాటిందీ భామ్మ. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 80 ఏళ్ల వయసులోనూ అంత చలాకీగా స్టెప్పులేస్తూ రచ్చ చేసిన భామ్మ అందరికీ ఆదర్శమంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Eco-friendly Ganesh: వినాయకుడి విగ్రహాలు మట్టితో కాదు.. ఆవు పేడతో.. తయారీలో కొత్త ఆలోచన భోపాల్ యువతి శ్రీకారం..

రోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. బరువు తగ్గేందుకు పక్కా ఫుడ్..

Monkeys: దారుణం.. కర్రలతో కోతులపై దాడికి దిగిన గ్రామస్థులు. గోదావరిలో దూకిన వందలాది వానరాలు.