ధోనీ హెలికాప్టర్ షాట్లు సేమ్ టూ సేమ్ బాదేసిన‌ ఏడేళ్ల అమ్మాయి

| Edited By: Anil kumar poka

Aug 14, 2020 | 6:25 PM

భార‌త‌ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ హెలికాప్టర్‌ షాట్ మ్యాజిక్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ధోనీ హెలికాప్టర్ షాట్లు సేమ్ టూ సేమ్ బాదేసిన‌ ఏడేళ్ల అమ్మాయి
Follow us on

భార‌త‌ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ హెలికాప్టర్‌ షాట్ మ్యాజిక్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌నకు మాత్ర‌మే సాధ్య‌మైన ఈ షాట్‌కు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఇంట‌ర్నేష‌న‌ల్, దేశవాళీ, గల్లీ క్రికెట్లోనూ ఈ షాట్‌ను అనుకరించేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. మహీలా మాజిటీజ్ దింపారంటే వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే .

ఇటీవలే ఓ ఏడేళ్ల అమ్మాయి హెలికాప్టర్‌ షాట్లు బాదేస్తున్న వీడియో ఇంట‌ర్నెట్‌లో తెగ వైర‌ల్ అవుతుంది. అందులో ఆమె ప్రతి బాల్‌ని హెలికాప్టర్‌ షాట్‌గా మలిచేందుకే ట్రై చేసింది. దాంతో భార‌త‌ మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ మంజ్రేకర్‌ ఆమెకు ఫ్యాన్స్ అయిపోఆయ‌రు. ఆకాశ్‌ చోప్రా అయితే ఆ చిన్నారి షాట్స్‌కు హిందీలో తన కామెంటరీని జోడించడం విశేషం. ‘అగ్గిపిడుగు… ఆమె మన పరీశర్మ. సూప‌ర్ టాలెంటెడ్‌ కదా?’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మంజ్రేకర్ రెస్పాండ్ అయ్యారు.

‘అందరూ హెలికాప్టర్‌ షాట్‌ను ప్రాక్టీస్ చేయడం ప్రజంట్ నేను చూస్తున్నా. వికెట్లకు అత్యంత సమీపంలో ఉండి బంతిని అందుకోవడం సహా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో ధోనీ ప్రాముఖ్యం తీసుకొచ్చిన మరో టెక్నిక్‌ ఇది. ఎదుగుతున్న ప్లేయ‌ర్స్‌కు ఇదో గొప్ప షాట్‌’ అని మంజ్రేకర్ పేర్కొన్నారు. పరీశర్మది హరియాణాలోని రోహ్‌తక్‌. భార‌త‌ మహిళల క్రికెట్‌ జట్టుకు ఆడాలన్నది ఆమె కోరికట.