Viral News: తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన యువకుడి ప్రేమలో 44 ఏళ్ల మహిళ.. అతనికి నెలకు 11 లక్షల జీతం..

Viral News: యుఎస్‌కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళా టిక్‌టాక్ యూజర్ తన ప్రియుడికి నెలవారీ జీతంగా ఏకంగా కొన్ని లక్షలను చెల్లిస్తుంది. తనకంటే తన ప్రియుడు..

Viral News: తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన యువకుడి ప్రేమలో 44 ఏళ్ల మహిళ.. అతనికి నెలకు 11 లక్షల జీతం..
Us Woman

Updated on: Oct 16, 2021 | 6:56 PM

Viral News: యుఎస్‌కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళా టిక్‌టాక్ యూజర్ తన ప్రియుడికి నెలవారీ జీతంగా ఏకంగా కొన్ని లక్షలను చెల్లిస్తుంది. తనకంటే తన ప్రియుడు 15 ఏళ్ళు చిన్నవాడిని.. అతను ఇంటి పనులు చేస్తున్నందుకు నెలకు   అక్షరాలా రూ. 11 లక్షలు(మనదేశ కరెన్సీలో) చెల్లిస్తున్నానని తెలిపింది.  టిక్ టాక్ తో ఫేమస్ అయిన జూలీ బాయ్ ఫ్రెండ్ కు కేవలం 29 ఏళ్ళు మాత్రమే. ఇదే విషయాన్నీ జూలీ స్వయంగా చెప్పింది. ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ కు కావాల్సినవన్నీ తానే కొంటానని.. అయితే అతను తాను ఏ పని చెప్పినా చేయాలనీ చెప్పింది జూలీ.  చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జూలీ తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఒకసారి స్విమ్మింగ్ ఫుల్ ని శుభ్రం చేయడం మరచిపోయాడని.. అప్పుడు అతని జీతాన్ని కట్ చేసినట్లు తెలిపింది. ఓ వైపు భారీగా జీతం ఇస్తూనే.. మరోవైపు అతనికి ఏమి కావాలన్నా అన్నీ తానే కొంటానని తెలిపింది.

అయితే సర్వసాధారణంగా మహిళలు తమ వయసుకు తగినవారితో సహజీవనం చేయాలనీ అనుకుంటారు కదా.. మీరు ఎందుకు మీ కంటే చిన్న వాడితో ప్రేమలో ఉన్నారు.. అతను ఎప్పుడైనా తన వయసుకు తగిన అమ్మాయి కనిపిస్తే.. మిమ్మల్ని వదిలేస్తే అంటూ ప్రశ్నించారు. దీంతో తన ప్రియుడు అలా చేయడని తనకు నమ్మకం ఉందంటూ జూలీ  తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అయితే తాము ఇద్దరం కలిసి బయటకు వెళ్తే.. చాలా మంచి తన ప్రియుడిని కుమారుడా అంటూ అడుగుతారు.. ఇలాంటి సందర్భాలు అనేకం తనకు ఎదురయ్యాయని.. అయితే తాము తమ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోమని చెప్పింది. తనకు యువకుడు అంటే ఇష్టం.. వారితోనే ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జూలీ లో టిక్ టాక్ తో మంచి ఫేమస్.. ఆమెకు మిలియన్‌లకు ఫాలోవర్స్ ఉన్నారు. 

Also Read: దసరా ఉత్సవాల్లో పాపని ఎత్తుకుని విధులు నిర్వహించిన డీసీపీ.. మానవత్వంతో స్పందించిన కలెక్టర్..