మండలిలో వైసీపీ, టీడీపీ బలాబలాలు ఇవే..!

ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అందరి చూపు మండలిపై మళ్లింది. అయితే ఇక్కడ బిల్లు నెగ్గడం కష్టమేనన్న భావన కనిపిస్తోంది. కానీ ఎలాగైనా గట్టెక్కాలన్న వ్యూహంతో జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ తన టీమ్‌తో చర్చించారని….సంఖ్యాబలం లేకున్నా గట్టెక్కేలా వ్యూహరచన చేశారని తెలుస్తోంది. మరి అసలు మండలిలో టీడీపీ బలం ఎంత.. వైసీపీ బలం ఎంత..? అనేది చూస్తే.. మండలిలో వైసీపీ కంటే టీడీపీ చాలా […]

మండలిలో వైసీపీ, టీడీపీ బలాబలాలు ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 11:10 AM

ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అందరి చూపు మండలిపై మళ్లింది. అయితే ఇక్కడ బిల్లు నెగ్గడం కష్టమేనన్న భావన కనిపిస్తోంది. కానీ ఎలాగైనా గట్టెక్కాలన్న వ్యూహంతో జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ తన టీమ్‌తో చర్చించారని….సంఖ్యాబలం లేకున్నా గట్టెక్కేలా వ్యూహరచన చేశారని తెలుస్తోంది.

మరి అసలు మండలిలో టీడీపీ బలం ఎంత.. వైసీపీ బలం ఎంత..? అనేది చూస్తే.. మండలిలో వైసీపీ కంటే టీడీపీ చాలా బలంగా ఉంది. టీడీపీ బలం 28 అయితే.. అధికార వైసీపీ సభ్యుల బలం 9 మంది సభ్యులు మాత్రమే. అయితే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలోనే ఉన్నారు కాబట్టి.. మరో సభ్యుడు అదనంగా ఉన్నట్లు. దీంతో ప్రభుత్వ బలం 10గా ఉంటుంది. కానీ టీడీపీకి మండలిలో 32 మంది సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వానికి కలిసివచ్చే మరో అంశం ఏంటంటే.. టీచర్స్ ఎమ్మెల్సీలు ఐదుగురు ఉన్నారు. వారికి అధికార, ప్రతిపక్ష పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. మరోవైపు వీరిలో ఎవరూ కూడా మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ మాట్లాడలేదు. వీరంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా.. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. అయితే ఇదంతా ఇలా ఉంటే.. ఆదివారం టీడీఎల్పీ నిర్వహించిన సమావేశానికి.. 12 మంది ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఇది ఇప్పుడు టీడీపీని కలవరపెడుతోంది. వీరిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు తెలిసినా.. మిగతా 10 మంది మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి వీరంతా ఇప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా.. లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.