Munugode Bypoll: మునుగోడు ఎన్నికలో వీరే కీలకం.. సగానికిపైగా ఓట్లు వీరివే.. ఆ జనం చుట్టే మొత్తం రాజకీయ చక్రం..

| Edited By: Phani CH

Nov 01, 2022 | 3:02 PM

ఎన్నికల్లో అతి కొద్ది శాతం ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారైపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా కీలకం మారుతుంది. అందుకే పంచాయతీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటువేసేలా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదులు పెడతాయి. దీనికితోడు ఈసారి మునుగోడు నమోదైన ఓట్లను పరిశీలిస్తే యువ ఓటర్లే కీలకంగా మారనున్నారు.

Munugode Bypoll: మునుగోడు ఎన్నికలో వీరే కీలకం.. సగానికిపైగా ఓట్లు వీరివే.. ఆ జనం చుట్టే మొత్తం రాజకీయ చక్రం..
Munugode Young Voters
Follow us on

రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం తనవైపుకు తిప్పుకున్న మునుగోడులో మునిగేది.. తేలేది ఎవరో మరో రెండు రోజుల్లో తెలనుంది. రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. నెల రోజులుగా ప్రచారాలు, రోడ్‌షోలు, ర్యాలీలతో హోరెత్తిన మైకులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మూగబోనున్నాయి. గెలుపే లక్ష్యంగా ఆఖరి గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నాయకులు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు మాత్రం వారి చేతిలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ప్రధాన పార్టీల ఓట్లను చీల్చేది ఓ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. మరోవైపు  తటస్థఓటర్లు కూడా ఇక్కడ గెలుపును నిర్ణయించనున్నారు. వీరితోపాటు మరో జనం కూడా ఉందే అదే యువజనం.

టార్గెట్ పెరిగింది.. లక్ష నుంచి 1.25కు చేరింది..

మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే దాదాపు 15వేల ఓట్లు పెరిగాయి. మొత్తం 2.41 లక్షల ఓట్లలో యూత్ ఓట్లే సగానికి పైగా ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో 39 ఏళ్లలోపు వయసు ఉన్న ఓటర్లు గెలుపోటముల్లో కీలకం కానున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మొదట్లో లక్ష ఓట్లను సాధించడం టార్గెట్‌గా పెట్టుకోగా.. కొత్త ఓటర్లతో ఆ సంఖ్య పెరిగింది. దీంతో టార్గెట్‌ ఇప్పుడు లక్షా 25వేల ఓట్లకు చేరింది. పోటీ ఎక్కువ ఉండటంతో ఈసారి పోలింగ్‌ 90శాతానికి పైగా నమోదుకావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో యువతపై పట్టున్న స్థానిక నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు తాయిలాలు ఇస్తున్నాయి.

30 ఏళ్లలోపు యువకులే కీలకం

ప్రస్తుతం మునుగోడులో ఉన్న ఓట్లలో భారీగా ఓట్లు 18 నుంచి 39 ఏళ్లలోపువారివే ఉన్నాయి. అంటే వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. యువత ఓట్లే ఆయా పార్టీల గెలుపును నిర్ధేశిస్తాయని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేందుకు వారి ఓట్లు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతుచిక్కని ఓటరు నాడి

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చిన వారి దగ్గర నుంచి హామీలు తీసుకున్నారు. మరి ఎవరికి పట్టడం కడతారో చూడాలి.

మునుగోడులో ఓటర్ల జాబితా ఓసారి చూస్తే…

  • నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు
  • గెలుపోటముల్లో కీలకం కానున్న యూత్‌
  • ఫస్ట్‌ ప్లేస్‌లో 30-40 ఏళ్ల వయసు ఓటర్లు
  • సెకండ్‌ ప్లేస్‌లో 30ఏళ్ల లోపు వయసు ఓటర్లు
  • 18–19 ఏళ్లవారు 8,432 మంది
  • 20-30ఏళ్ల మధ్య 51,131 మంది
  • 30ఏళ్లలోపువారు 59,563 మంది ఓటర్లు
  • అక్టోబర్‌ 4 వరకు 25,831 కొత్త దరఖాస్తులు
  • ఆమోదించిన దరఖాస్తులు 15,134
  • తిరస్కరించిన దరఖాస్తులు 10,696

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Also Read:

Minister KTR: బీజేపీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు