బెల్లం లడ్డూ ప్రసాదం..యాదాద్రిలో ప్రయోగం

|

May 10, 2019 | 4:39 PM

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రయోగాత్మకంగా బెల్లంతో లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రిలో దేవస్థానం పాచకస్వాములు బెల్లం పాకంతో 103 లడ్డూలు తయారు చేశారు. బెల్లం లడ్డూల తయారీ, నిర్వహణ, ఖర్చు, నిల్వ తదితర అంశాలతో కమిటీ సభ్యులు నివేదిక రూపొందించారు. ఆ నివేదిక, లడ్డూ ప్రసాదాలను ఆలయ ఈవో పరిశీలించిన తర్వాత దేవాదాయ శాఖ అనుమతుల కోసం పంపుతారు. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే […]

బెల్లం లడ్డూ ప్రసాదం..యాదాద్రిలో ప్రయోగం
Follow us on

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రయోగాత్మకంగా బెల్లంతో లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రిలో దేవస్థానం పాచకస్వాములు బెల్లం పాకంతో 103 లడ్డూలు తయారు చేశారు. బెల్లం లడ్డూల తయారీ, నిర్వహణ, ఖర్చు, నిల్వ తదితర అంశాలతో కమిటీ సభ్యులు నివేదిక రూపొందించారు. ఆ నివేదిక, లడ్డూ ప్రసాదాలను ఆలయ ఈవో పరిశీలించిన తర్వాత దేవాదాయ శాఖ అనుమతుల కోసం పంపుతారు. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే భక్తులకు బెల్లం లడ్డూ ప్రసాదాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

స్వామివారి ప్రసాదం మరింత రుచిగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే విషయంలో బెల్లం లడ్డూలు బాగుంటాయనే ఉద్దేశ్యంతోనే ఆలయ అధికారులు ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెల్లం లడ్డూలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. చక్కెర లడ్డూలతో పోలిస్తే బెల్లం లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయనే వాదన కూడా ఉంది. అయితే బెల్లం లడ్డూలతో పాటు… చక్కెర లడ్డూల తయారీని కూడా కొనసాగించనున్నారని సమాచారం. మొత్తానికి యాదాద్రి లక్ష్మీ నరసింహుడి భక్తులకు త్వరలోనే కొత్తరకం లడ్డూల రుచి చూసే భాగ్యం దక్కనుంది.