
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వన్యప్రాణులను తరలిస్తున్నారనే సమాచారంతో SOT పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో కారు జింక మాంసం తరలిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 కిలోల జింక మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం.. కారులో జింక మాంసాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందడంతో SOT పోలీసులు టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న రెండు కార్లను తనిఖీ చేయగా జింక మాంసం బయటపడింది. మాంసంతో పాటు ఒక రైఫిల్‌ను కూడా గుర్తించిన పోలీసులు.. వాహనాల్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల అనంతరం 13 కిలోల జింక మాంసం, రైఫిల్‌తో పాటు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిని తదుపరి విచారణ నిమిత్తం కొత్తూరు పోలీసులకు అప్పగించారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కేసుకు సంబంధించిన తదుపరి ప్రక్రియ కొనసాగింది. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. జింకను వేటాడిన ప్రదేశం, మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైఫిల్‌కు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వన్యప్రాణుల వేట, అక్రమ మాంసం రవాణాపై నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..