Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?

కొండా సురేఖ పార్టీ మారేది లేదని చెబుతున్నా.. ఆమె పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఇక కాంగ్రెస్‌లో ఉండేది లేదని ఓ వైపు కేడర్ వాదిస్తున్నా.. వేచి చూద్దాం అన్న ధోరణిలో కొండా దంపతులున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొండా ఫ్యామిలీ పార్టీ మారితే.. ఏ పార్టీలోకి వెళ్తారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?
What Is Konda Surekha Plan B

Updated on: Sep 06, 2026 | 7:33 AM

మంత్రి పదవి ఊస్టింగ్ తర్వాత.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెబుతున్నా.. వారికి ప్లాన్ బి కూడా ఉందని, పార్టీ మారతారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవమానాలు భరిస్తూ.. కాంగ్రెస్‌లో ఎందుకు కొనసాగాలని కొండా కేడర్ ప్రశ్నిస్తుండగా.. ఇప్పటికైతే సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు.. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరడం పక్కా అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే.. తను గతంలో పనిచేసిన బీఆర్ఎస్‌లోకి వెళ్తారా?. లేక కొత్తగా బీజేపీలో చేరతారా?. అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కొండా దంపతుల చేరికపై.. సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

తామెవ్వరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని, కొండా సురేఖను తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వబోమన్నారు మాజీమంత్రి జగదీష్‌ రెడ్డి. దీంతో.. బీఆర్ఎస్ గేట్లు క్లోజ్ అయినట్లేనని తెలుస్తోంది. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న కథనాలపై బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్త నేతలకు బీజేపీ చెత్తకుప్ప కాదన్నారు. కాంగ్రెస్‌ సంక్షోభంలోకి బీజేపీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేపీ అసలైన ప్రత్యామ్నాయమని మురళీధర్ రావు అన్నారు.

కొండా సురేఖ చేరికపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పెద్దలు మాత్రంగా పెద్దగా ఏమీ మాట్లాడటం లేదు. కిందిస్థాయి నాయకులు వారిని చేర్చుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువలు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఎన్నికల నాటికి రోజుకో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. కొండా ఏ పార్టీలో చేరతారు?. అసలు కాంగ్రెస్‌ను వీడతారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లేదు. బీసీ మహిళ.. వరంగల్‌లో బలమైన కేడర్ ఉన్న నాయకులు కావడంతో కొండా దంపతులు పార్టీలో చేరితో లాభం జరుగుతుందని, బీఆర్ఎస్, బీజేపీ అధిష్ఠానం భవిష్యత్‌లో ఏ నిర్ణయమైనా తీసుకొవచ్చనే పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్.

Loading...
Unable to load recommendations.
Follow Us