Telangana Rain: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక

|

Sep 19, 2021 | 10:46 AM

Weather Forecast: తెలంగాణలో గత వారం కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..

Telangana Rain: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక
Follow us on

Weather Forecast: తెలంగాణలో గత వారం కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.

అలాగే, బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది నేడు ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు స్వల్పంగా, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత కూడా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కురిసే ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి