Warangal: మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. భార్య చూడండి ఏం చేసిందో..?

|

Sep 04, 2022 | 3:12 PM

భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. ఆపై అపరకాళి మారి తప్పు చేసిన భర్త చంపలు వాయించింది.

Warangal: మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. భార్య చూడండి ఏం చేసిందో..?
Illegal Affair
Follow us on

Telangana: సొసైటీ జరిగే దాదాపు 90 శాతం క్రైమ్స్ వెనక రీజన్ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఉంటున్నాయి. పరాయి వాళ్ల మోజులో పడి పచ్చని సంపారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు చాలామంది.  ఈ చాటుమాటు వ్యవహారం.. కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. మరో మహిళతో సహజీవనం చేస్తూ భార్యకు దొరికిపోయాడు. దీంతో అతడి భార్య, బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. పైడిపల్లి ప్రాంతంలో GWMC లో ఉద్యోగం చేస్తున్న జీవన్‌కుమార్‌ అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు జీవన్‌కుమార్‌. తాజాగా పరాయి మహిళతో సన్నిహితంగా ఉంటూ… భార్య చందనకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు జీవన్‌కుమార్‌. ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యతో పాటు ఆమె బంధువులు జీవన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి