వీఆర్వోను నిర్భంధించిన గ్రామస్తులు..!

| Edited By:

Jun 03, 2019 | 4:22 PM

లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానంటూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వీఆర్వోకి గట్టిగా బుద్ధి చెప్పారు ఆ గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్‌ పేట వీఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించారు. పాస్ పుస్తకాల విషయంలో వీఆర్వో ఆదినారాయణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ ఆఫీస్‌లో ఉండరని, అలాగే ఫుల్లుగా మద్యం సేవించి వస్తారని వస్తాడని చెబుతున్నారు. గ్రామంలో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ల పేరు మీద రైతుల భూమిని […]

వీఆర్వోను నిర్భంధించిన గ్రామస్తులు..!
Follow us on

లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానంటూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వీఆర్వోకి గట్టిగా బుద్ధి చెప్పారు ఆ గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్‌ పేట వీఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించారు. పాస్ పుస్తకాల విషయంలో వీఆర్వో ఆదినారాయణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ ఆఫీస్‌లో ఉండరని, అలాగే ఫుల్లుగా మద్యం సేవించి వస్తారని వస్తాడని చెబుతున్నారు. గ్రామంలో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ల పేరు మీద రైతుల భూమిని అక్రమంగా రాసేస్తాడని, మండల అధికారులతో విన్నవించుకున్నా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. గ్రామసభలో నేపథ్యంలో ఊళ్లోకి వచ్చిన వీఆర్వోని చుట్టుముట్టిన ప్రజలు అతన్ని లాక్కెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. తమ డిమాండ్లను నెరవేరిస్తే తప్ప వీఆర్వోని వదిలే ప్రసక్తి లేదని అధికారులకు తేల్చి చెప్పారు గ్రామస్తులు. దీంతో.. దిగొచ్చిన చిట్యాల తహసీల్దార్.. రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి వీఆర్వో ఆదినారాయణను విడిపించి తీసుకెళ్లారు.