బావిలో పడ్డది కుక్క కాదు .. తీరా చూస్తే..!

| Edited By:

Jul 06, 2019 | 9:53 PM

అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దారితప్పిన ఎలుగుబండ్లు ఊరిమధ్యకు వచ్చి అప్పుడప్పుడు జనాన్ని భయపెడుతూ ఉంటాయి సర్వసాధారణమైపోయింది. అలాగే ఒక్కోసారి అడవి పందులు, చిరుతలు సైతం జనావాసాల్లోకి రావడం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్దగల కాట్రపల్లి గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే కలకలం రేపింది. గ్రామంలో ఉన్న నేల బావిలో ఏదో జంతువు పడిపోయిందని అక్కనున్న వాటర్ మ్యాన్ ఊరి జనాలకు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా వచ్చి చూసారు. […]

బావిలో పడ్డది కుక్క కాదు .. తీరా చూస్తే..!
Follow us on

అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దారితప్పిన ఎలుగుబండ్లు ఊరిమధ్యకు వచ్చి అప్పుడప్పుడు జనాన్ని భయపెడుతూ ఉంటాయి సర్వసాధారణమైపోయింది. అలాగే ఒక్కోసారి అడవి పందులు, చిరుతలు సైతం జనావాసాల్లోకి రావడం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్దగల కాట్రపల్లి గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే కలకలం రేపింది.

గ్రామంలో ఉన్న నేల బావిలో ఏదో జంతువు పడిపోయిందని అక్కనున్న వాటర్ మ్యాన్ ఊరి జనాలకు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా వచ్చి చూసారు. నీటిలో గిలగిలా కొట్టుకుంటున్న దాన్ని చూసి అంతా కుక్క అని భావించారు. తీరా ఏదోలా కష్టపడి రక్షించి బయటికి తీస్తే ..అది కుక్క కాదు నక్క అని గుర్తించారు ఊరి జనం. దీంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

అడవిల్లోనూ, పొలాల్లోనూ ఉండాల్సిన నక్క గ్రామంలోకి ప్రవేశించి పొరబాటున బావిలో పడిపోయింది. ఒకవేళ ఎవరూ దాన్ని చూడకుండా ఉంటే దాని ప్రాణాలు పోయేవే. అయితే ప్రమాదానికి కారణమైన నేలబావికి గోడలు ఎత్తు తక్కువగా ఉండటంతోనే ఇలా జరిగిందని, వీటి ఎత్తు పెంచితే ఇలాంటి ప్రమాదాలు జరగవంటున్నారు స్ధానికులు.