Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‏ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి.. ఆలస్యంగా బయలుదేరిన రైలు..

|

Feb 04, 2023 | 4:18 PM

ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగింది. రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పందిల్లపల్లి స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. నిన్న ఘటన జరగగా..

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‏ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి.. ఆలస్యంగా బయలుదేరిన రైలు..
Vande Bharat Express
Follow us on

ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగింది. రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పందిల్లపల్లి స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. నిన్న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న ఖమ్మం రైల్వే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. విచారణ చేస్తున్నారు. ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు. రైలు ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన 20833 రైలు 8:50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరింది.

కాగా.. గతంలోనూ విశాపట్నం లో ఇలాంటి ఘటనే జరిగింది. ట్రయల్ రన్ కోసం వందేభారత్ రైలు వైజాగ్ కు వచ్చింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..