తెలంగాణలో వడగండ్లు… రైతులకు కడగండ్లు

| Edited By: Ravi Kiran

Apr 19, 2019 | 6:10 PM

తెలంగాణలో గురువారం రాత్రి హైదరాబాద్‌తో పాటు నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులపైన  నీరు నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి యాదగిరిగుట్ట, భువనగిరి, ఖమ్మం, హుస్నాబాద్, అక్కన్నపేట, నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ […]

తెలంగాణలో వడగండ్లు... రైతులకు కడగండ్లు
Follow us on

తెలంగాణలో గురువారం రాత్రి హైదరాబాద్‌తో పాటు నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులపైన  నీరు నిలిచిపోయింది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి యాదగిరిగుట్ట, భువనగిరి, ఖమ్మం, హుస్నాబాద్, అక్కన్నపేట, నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భువనగిరి, ఖమ్మం, నేలకొండపల్లి, హుస్నాబాద్, కల్వచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సుమారు 30వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఈ వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో అనేక చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుపాట్లతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.