TSRTC MD Sajjanar: ఆర్టీసీ డిపోల ఎత్తివేతపై క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్.. ఎమని చెప్పారంటే..!

|

May 09, 2022 | 6:10 AM

TSRTC MD Sajjanar: ఇన్నాళ్లూ నష్టాల్లో నడిచిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలబాట పట్టిందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. రాష్ట్రంలో డిపోల..

TSRTC MD Sajjanar: ఆర్టీసీ డిపోల ఎత్తివేతపై క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్.. ఎమని చెప్పారంటే..!
Sajjanar
Follow us on

TSRTC MD Sajjanar: ఇన్నాళ్లూ నష్టాల్లో నడిచిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలబాట పట్టిందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. రాష్ట్రంలో డిపోల ఎత్తివేతపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవును.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు తీసుకున్నాక కాస్త లాభాలబాటలో పడింది ఆర్టీసీ. వినూత్న పథకాలను రూపొందిస్తూ సంస్థను గట్టెక్కించడానికి సజ్జనార్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునేందుకు వుమెన్స్‌ డే, మదర్స్‌డే సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. స్వయంగా ఫ్యామిలీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చపరిచారు కూడా. ఎప్పటికప్పుడు డిపోల్లో తనిఖీలు చేస్తూ ఆర్టీసీ పరిరక్షణకు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే వికారాబాద్‌ జిల్లా పరిగి డిపోను సందర్శించారు. డిపో నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఎత్తేస్తారన్న ఆరోపణలను సజ్జనార్‌ ఖండించారు. త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీకి ప్రజల నుంచి రెస్పాన్స్‌ బాగా వస్తోందన్నారు. గ్రామీణప్రాంతాల్లో మరిన్ని సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు సజ్జనార్. ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల బాట పట్టిందన్న ఆయన.. ఆర్టీసీ డిపోలు ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.